Skip to main content

రిలయన్స్ కేవలం రూ.399 రూపాయలకే కొత్త Jio Phone 5 తెస్తోందా ? అసలు నిజం ఏమిటి?


త్వరలోనే, రిలయన్స్ జియో కొత్త ఫీచర్ ఫోన్ను తీసుకురానున్నట్లు చాలా నివేదికలు ప్రకటించాయి. అయితే, జియో తీసుకురానున్న ఫోన్ ఎలా ఉంటుంది ? ఎంత రేటుతో వస్తుంది ? అని సర్వత్రా చర్చలు జోరుగా సాగుతున్నాయి. వాస్తవానికి, ఈ ఫోన్ గురించి అధికారికంగా జియో నుండి ఎటువంటి ప్రకటన కూడా బయటకి రాకపోయినా, ఈ ఫోన్ గురించిన వార్తలు ఆన్లైన్లో జోరందుకున్నాయి. కానీ, ఈ ఫోన్ గురించి ప్రస్తుతం వినిపిస్తున్న చాలా వార్తలు కూడా నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే, దీని ధర, స్పెక్స్ మరియు ఫీచర్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

పాత, ఒరిజినల్ జియో ఫోన్ గురించి ఒకసారి గుర్తుచేసుకుంటే, ఈ మొబైల్ ఫోన్‌ ను LTE సర్వీస్ తో రూ .999 ధరకు అందించినట్లు మనకు తెలుసు. అయితే, జియో ఫోన్ 2 ని తీసుకొచ్చిన తరువాత, ఈ ఫోన్ కేవలం 699 రూపాయల రేటుకే అమ్మడువుతోంది . అయితే, ఇప్పుడు కొత్త జియో ఫోన్ మోడల్ Jio Phone 3 స్థానంలో Jio Phone 5 ను సరసమైన మొబైల్ ఫోన్ ‌గా మార్చనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

91 మొబైల్స్ నివేదికలో, జియో సంస్థ  ఈ Jio Phone 5 కోసం విస్తృతంగా పనిచేస్తున్నట్లు చెప్పబడింది. అయితే, ఇది స్మార్ట్ ఫోన్ ఫోన్ కాదని, ఇది కేవలం ఫీచర్ ఫోన్ మాత్రమే అవుతుందని అర్ధమవుతోంది. అంతేకాదు, ఒరిజినల్ Jio Phone కంటే  రానున్న ఈ Jio Phone 5 తక్కువ మోడల్ అవుతుందనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. అందుకే, Jio Phone 5 మొదట వచ్చిన Jio Phone కంటే చాలా తక్కువ ధరకు వస్తుందని చెప్పబడుతోంది.

ఈ నివేదిక నుండి Jio Phone 5 Price విషయానికి వస్తే, రూ .399 ప్రారంభ ధరకు అందించవచ్చని కూడా పేర్కొంటోంది. అంటే Jio Phone 5 ను చాలా చౌకగా మరియు సరసమైన ఫోన్ ‌గా మార్కెట్లో లాంచ్ చేయవచ్చని సందేహం లేకుండా చెప్పవచ్చు. ఇది కాకుండా, మీరు ఈ పరికరంలో 4G LTE కనెక్టివిటీతో కూడా ఉండవచ్చు.

Jio Phone 5 ఫీచర్స్

Jio Phone 5 ను 4 జి LTE తో లాంచ్ చేయవచ్చని భావిస్తున్నారు, దీనికి తోడు మీరు KaiOS తో మాత్రమే ఈ ఫోన్ వస్తుంది . ఈ మొబైల్ ఫోన్ ‌లో, అంటే Jio Phone 5 లో , ప్రీ లోడెడ్ బ్రౌజర్ ఇన్ ‌స్టాల్స్ ను పొందవచ్చు. అంటే, ఈ Jio Phone 5 ‌లో మీరు ముందే లోడ్ చేసిన వాట్సాప్, గూగుల్, ఫేస్ ‌బుక్ మరియు ఇతర యాప్‌ లను అందుకుంటారని అర్ధం చేసుకోవచ్చు .

ఈ నివేదికలో, Jio Phone 5 యొక్క వినియోగదారులు Jio టూ Jio నంబర్‌ పై కాల్స్ కోసం ఛార్జీలు వసూలు చేయబోవడం లేదు, అంటే ఈ ఫోన్ ‌తో మీకు ఉచితంగా కాల్ వస్తుంది. అయితే ఇంటర్నెట్ మొదలైన వాటి కోసం మీరు ప్రత్యేక ఇంటర్నెట్ ప్యాక్ పొందాలి. జియో నుండి వచ్చిన జియో ఫోన్ ప్లాన్ ‌ను జియో ఫోన్ లైట్ జియో ఫోన్ లైట్ వినియోగదారులలు మాత్రమే ఉపయోగించవచ్చు. అయితే, సంస్థ కొత్త ప్రణాళికలతో ముందుకు వచ్చే అవకాశం ఉంది.         

Comments