దేశంలో కరోనా కేసులు పెరుగుతుండగా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. కరోనా లక్షణాలు కనిపించడంతో ఇటీవల పరీక్షలు చేయించుకున్న ఆయనకు పాజిటివ్ గా తేలింది డాక్టర్ల సూచన మేరకు తాను ఆస్పత్రిలో చేరుతున్నట్లు చెప్పిన అమిత్ షా.. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు ఐసోలేషన్లో ఉండాలని, అవసరమైతే కరోనా పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు
నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

Comments
Post a Comment