Skip to main content

సాఫ్ట్‌వేర్ శారద’కు టిటా చేయూత.. ఏఐపై ఉచిత శిక్షణ




కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయి కూరగాయల వ్యాపారం చేస్తున్న ‘సాఫ్ట్‌వేర్ శారద’కు  తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ (టిటా) చేయూత అందించేందుకు ముందుకొచ్చింది. శనివారం ఆమెకు ఉచితంగా ల్యాప్‌టాప్ అందించిన టిటా గ్లోబల్ అధ్యక్షుడు సందీప్ మక్తాల.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై ఆమెకు ఉచితంగా శిక్షణ ఇస్తామన్నారు.

ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డల్లాస్ భాగస్వామ్యంతో టిటా చేపట్టిన శిక్షణ కార్యక్రమంలో ఉచితంగా శిక్షణ పొందేందుకు అవసరమైన పత్రాలను ఆమెకు అందించారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఓ సంస్థలో పనిచేసిన శారద.. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఉద్యోగం కోల్పోయింది. ఉద్యోగం కోల్పోయినందుకు ఏమాత్రం దిగులు చెందకుండా కూరగాయలు అమ్ముతూ కుటుంబానికి అండగా నిలిచింది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిన ఆమె తీరు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.  

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...