Trojan కేటగిరికి చెందినదిగా చెబుతున్న 'BlackRock' అనే ఒక మాల్వేర్ Android స్మార్ట్ ఫోన్ల నుండి వినియోగదారుల విలువైన బ్యాంక్ సమాచారాన్ని సేకరిస్తున్నట్లు బయటపడింది.
ఇప్పటి వరకూ పర్సనల్ డేటా చౌర్యానికి మాత్రమే పరిమితమైన సైబర్ దాడులు ఇప్పుడు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల నుండి బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా దోచుకునేంతగా ముందుకు సాగుతోంది.
ఒక మాల్వేర్, బ్యాంక్ అకౌంట్ ఆధారాలను మరియు క్రెడిట్ కార్డు వాటి వాటి వివరాలను ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ల ద్వారా సేకరిస్తున్నట్లు మరియు ఇది దాదాపుగా 300 పైగా ఆండ్రాయిడ్ యాప్స్ పైన తాన్ ప్రభావాన్ని చూపిస్తున్నట్లు తెలిపింది.
అసలే ప్రజలు కరోనా మహమ్మారితో దెబ్బకి హడలెత్తి పోతోంటే, ఆన్ లైన్ లో సైబర్ దాడులు మరియు సైబర్ మోసాలు మరింతగా కృంగదీస్తున్నాయి. ఇప్పటి వరకూ పర్సనల్ డేటా చౌర్యానికి మాత్రమే పరిమితమైన సైబర్ దాడులు ఇప్పుడు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల నుండి బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా దోచుకునేంతగా ముందుకు సాగుతోంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక నివేదిక ప్రకారం,Trojan కేటగిరికి చెందినదిగా చెబుతున్న 'BlackRock' అనే ఒక మాల్వేర్ Android స్మార్ట్ ఫోన్ల నుండి వినియోగదారుల విలువైన బ్యాంక్ సమాచారాన్ని సేకరిస్తున్నట్లు బయటపడింది.
ఈ BlackRock Malware గురించి ముందుగా Tribuneindia నివేదించింది. ఈ నివేదిక ప్రకారం, ఇండియాలో టాప్ సెక్యూరిటీ విభాగం అయినటువంటి కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (CERT-in) ఒక మాల్వేర్, బ్యాంక్ అకౌంట్ ఆధారాలను మరియు క్రెడిట్ కార్డు వాటి వాటి వివరాలను ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ల ద్వారా సేకరిస్తున్నట్లు మరియు ఇది దాదాపుగా 300 పైగా ఆండ్రాయిడ్ యాప్స్ పైన తాన్ ప్రభావాన్ని చూపిస్తున్నట్లు తెలిపింది.
అంతేకాదు, ఇది కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రభాన్ని చూపిస్తోంది. ఈ మాల్వేర్, LokiBoat ఆండ్రోయ్ ట్రోజన్ యొక్క మరొక వేరియంట్ అయిన జెర్సెస్ బ్యాంకింగ్ యొక్క సొరె కోడ్ ఉపయోగించి ఈ మాల్వేర్ తయారు చేయబడినట్లు, ఈ నివేదిక తెలిపింది.
అందుకే, సరైన సర్టిఫికేషన్ లేని మరియు తర్డ్ పార్టీ యాప్స్ డౌన్లోడ్ చేసేవారు లేదా ఉపయోగిస్తున్న వారు చాలా జాగ్రతగా వహించాలని, CERT-in చెబుతోంది. దీనితో పాటుగా, ఈ మాల్వేర్ మరికొన్ని ప్రధాన యాప్స్ కి విస్తరించవచ్చని కూడా అనుమానం వ్యక్తం చేస్తోంది.
Comments
Post a Comment