Skip to main content

ఇండియన్ ఆర్మీ కీలక నిర్ణయం: అలాంటి సినిమాలు తీయాలంటే రక్షణశాఖ అనుమతి తప్పనిసరి...



ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు వేలాది సినిమాలు వచ్చాయి.  అందులో ఆర్మీ నేపథ్యంలో వచ్చిన సినిమాలు చాలా వరకు సూపర్ హిట్ అయ్యాయి.  ఇటీవలే వచ్చిన యూరి సినిమా బంపర్ హిట్ కొట్టడంతో పాటు, అందులో మెయిన్ రోల్ పోషించిన విక్కీ కౌశల్ జాతీయ అవార్డు దక్కించుకున్నాడు. సర్జికల్ స్ట్రైక్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.  

అయితే, కొన్ని సినిమాల్లో ఆర్మీపై విమర్శలు చేస్తూ, విలన్ గా చూపిస్తున్న సంగతి తెలిసిందే.  దీంతో ఇండియన్ ఆర్మీ ఓ  కీలక నిర్ణయం తీసుకుంది.  ఇకపై ఆర్మీ నేపథ్యంలో సినిమాలు తీయాలంటే తప్పనిసరిగా రక్షణశాఖ అనుమతి తీసుకోవడం తో పాటు ఎన్ఓసి తీసుకోవాలి.  ఇక సినిమా రిలీజ్ అయ్యే ముందు సినిమాలోని ఆర్మీకి సంబంధించిన సన్నివేశాలను రక్షణశాఖకు చూపించి ఆమోదం పొందిన తరువాత మాత్రమే సినిమాలను రిలీజ్ చేయాలని ఇండియన్ ఆర్మీ పేర్కొన్నది.   ఇది గొప్ప నిర్ణయం అని చెప్పాలి.  మరి దీనిపై సినిమా ఇండస్ట్రీ ఎలా స్పందిస్తుందో చూడాలి. 

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

హెలికాప్టర్ కు అనుమతి ఇవ్వని అధికారులు.. కేసీఆర్ సభ రద్దు

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూర్ నగర్ సభ రద్దైంది. భారీ వర్షం కారణంగా సభను రద్దు చేశారు. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో కేసీఆర్ హెలికాప్టర్ కు ఏవియేషన్ అధికారులు అనుమతి ఇవ్వలేదు. అధికారుల సూచనతో కేసీఆర్ తన సభను రద్దు చేసుకున్నారు. సీఎం రావడం లేదనే ప్రకటనతో సభా ప్రాంగణానికి భారీగా చేరుకున్న నాయకులు, ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు.