Skip to main content

జగన్ మూడు రాజధానుల సక్సెస్ పై రాజమౌళి ఫుల్ హ్యాపీస్...? |


తెలుగు స్టార్ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు రావడంపై చాలా ఖుషీగా ఉన్నారట. దర్శకధీరుడు కి అసలు ఏపీ రాజకీయాల తో పనేంటి అని అనుకుంటున్నారా..? అయితే ఇది చదవాల్సిందే.

గతంలో అమరావతిని రాష్ట్ర రాజధానిగా నిర్ణయించినప్పుడు చంద్రబాబు బాహుబలి సినిమాకి దర్శకత్వం వహిస్తున్న ఎస్.ఎస్.రాజమౌళి ని హుటాహుటిన క్యాపిటల్ ప్రాంతానికి పిలిపించారు. అతనిని అమరావతి కట్టడాలకు కి సంబంధించిన కొన్ని డెమో మోడల్స్ ను తయారు చేయమని మరియు ఏ రకంగా ఒక రాజధాని కడితే ప్రజలకు బాగుంటుందో సూచించమని అడిగారు. మాహిష్మతి సృష్టికర్త అయిన రాజమౌళి ఎలాంటి మోడల్స్ ను అప్పటి ఏపీ ముఖ్యమంత్రి కి ఇచ్చారో లేదో తెలియదు కానీ ఆయన దాని పట్ల చంద్ర బాబు సంతృప్తి చెందలేదని రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక తాను కూడా మర్యాదపూర్వకంగా ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు కూడా తెలిపారు. అంత పెద్దగా దానిమీద వర్క్ చేసే అవకాశం రాలేదని ఆదిలోనే ఆ ప్రాజెక్ట్ నుండి వైదొలిగినట్లు తెలిపారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే 2014లో చాలా యాదృశ్చికంగా రాజమౌళి మూడు రాజధానులు నిర్ణయానికి జై కొట్టారు. లోక్ సభ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ అప్పటి తన ఎన్నికల మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులను తాను అధికారంలోకి వస్తే నిర్మిస్తానని చెప్పడం గమనార్హం. ఇలాగే అడ్మినిస్ట్రేటివ్ ఒకచోట, లెజిస్లేటివ్ ఒకచోట మరియు జుడీషియరీ మరో చోట నిర్మిస్తారని తెలిపారు. దీనికి రాజమౌళి తన ఫేస్ బుక్ అకౌంట్ లో “లోక్ సత్తా చెప్పిన సూత్రం ఆంధ్రప్రదేశ్ రాజధానికి చాలా మంచి సొల్యూషన్” అని తను కూడా దానికి మద్దతు ఇస్తున్నట్లు చెప్పడం జరిగింది.

ఇక ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు విషయమై దాదాపు తొమ్మిది నెలలు పోరాడి పంతం నెగ్గించుకున్న సమయంలో రాజమౌళి కచ్చితంగా ఆనందపడే ఉంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు. లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ సూచించింది కూడా అచ్చం ఇలాంటి మోడలే కాబట్టి రాజమౌళి ఫుల్ ఖుషి అయిపోయి ఉంటాడు అని చెప్పవచ్చు



Comments