Skip to main content

రాజధానిపై చిత్తశుద్ధి ఉంటే టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి: పవన్ కల్యాణ్



జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీతో చర్చించారు. ఈ సందర్భంగా పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతి కోసం టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని అన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు కూడా శాసనసభ్యత్వాలకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

అమరావతిపై చిత్తశుద్ధి ఉంటే ప్రత్యక్ష పోరాటంలోకి రావాలని తెలిపారు. రాజధాని వికేంద్రీకరణ పేరిట మూడు ప్రాంతాల మధ్య చిచ్చురేపుతున్నారని పవన్ ఆరోపించారు. రైతు కన్నీరుపై రాజధాని నిర్మాణం వద్దని మొదటి నుంచి చెబుతున్నామని, ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే రాజధాని క్రీడ మొదలుపెట్టారని విమర్శించారు. రాజధాని వికేంద్రీకరణపై న్యాయకోవిదులు, నిపుణులతో చర్చిస్తామని తెలిపారు.  

Comments