Skip to main content

సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం.. ఇకపై అలా కుదరదు


ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ఇస్తున్న హామీలు, తీసుకుంటున్న నిర్ణయాల అమలులో జాప్యం జరుగుతుందనే విషయాన్ని గమనించిన సీఎం జగన్... ఈ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం జగన్ ఆదేశాలు అమలు కాకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సీఎంవో... సీఎం ఆదేశాలు సమయానుగుణంగా అమలు కాకపోవడంతో సంక్షేమ పథకాల అమల్లో ఇబ్బందులు తలెత్తున్నాయని భావిస్తోంది. ఈ కారణంగా వాటి తీవ్ర తగ్గుతుందనే భావనలో సీఎంవో కార్యాలయం ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఏపీ బిజినెస్ రూల్స్ 2018లో సవరణలు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

కార్యదర్శుల నుంచి సీఎంకు ఈ-ఆఫీస్ ద్వారా పంపే ఫైళ్లు మూడు కేటగిరీలుగా విభజిస్తూ నిర్ణయం తీసుకుంది. అదేరోజు లేదా మోస్ట్ ఇమీడియేట్, ఇమీడియేట్‌గా విభజన చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతీ శాఖ నుంచి వచ్చే ఫైళ్లకు ఆర్ధిక, న్యాయశాఖల నుంచి క్లియరెన్స్ తీసుకునేందుకు గడువు విధించింది. వివిధ శాఖల నుంచి వచ్చే ఫైళ్లను ఆర్ధిక, న్యాయశాఖలు రెండు రోజుల్లో క్లియర్ చేసేలా ఆదేశించింది. మిగతా శాఖలు ఒక రోజులో క్లియర్ చేసేలా ఆదేశాలు ఇచ్చారు. నిర్ణీత సమయంలో క్లియర్ కాకపోతే వాటిని ఆటోమేటిక్‌గా క్లియర్ అయినట్లు గుర్తించనున్నారు.

సీఎం ఆమోదం తర్వాత 15 రోజుల్లోగా జీవో విడుదల కావాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆమోదం తర్వాత నిర్ణీత సమయంలో జీవోలు ఇవ్వకపోతే కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నారు. మీడియాకు సంబంధం ఉన్న అంశాల్లో సీఎంకు తెలియకుండా మంత్రులు, అధికారులు జీవోలు ఇవ్వరాదని ఆదేశాలు జారీ చేశారు. సీఎంకు పంపిన ముసాయిదా ఉత్తర్వులపై సీఎంవో నుంచి ఐదురోజుల్లోగా స్పందన రాకపోతే ఆమోదంగా గుర్తించి జీవో విడుదల చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Comments