పనామా
పేపర్స్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొని అరెస్టైన నవాజ్ షరీఫ్ ప్రస్తుతం
లాహోర్ జైల్‌లో శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని
రోజులుగా ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో నవాజ్
షరీఫ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించి
చికిత్స అందిస్తున్నారు. అనారోగ్యం కారణంగా మెడికల్ పర్మిటెన్స్ కింద నవాజ్ షరీఫ్‌కు లాహోర్
హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో జైలు అధికారులు షరీఫ్‌ను
ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
నవాజ్ షరీఫ్‌కు అత్యుత్తమ చికిత్స అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు.
Comments
Post a Comment