Skip to main content

అశ్వత్థామరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన డ్రైవర్...




ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డిపై కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో కూకట్‌పల్లి డిపోకు చెందిన కోరేటి రాజు అనే డ్రైవర్ ఫిర్యాదు చేశాడు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ తో కార్మికుల జీవితాలతో ఆటలాడుకుంటూ.. వారి ఆత్మహత్యకు అశ్వత్థామరెడ్డి కారణమవుతున్నాడని డ్రైవర్ ఆరోపించాడు. కార్మికుల కోసం కొట్లాడేందుకు చాలా మంది నాయకులు ఉన్నారు. సీఎం కేసీఆర్ నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. డ్రైవర్లు, కండక్టర్లు డ్యూటీల్లో జాయిన్ అయితే తమకు అభ్యంతరం లేదని.. ఇష్టమున్న వారు దరఖాస్తు పెట్టుకోవచ్చని సూచించారని.. అందుకనుగుణంగా అందరూ విధుల్లో చేరాలని రాజు పిలుపునిచ్చారు.
ప్రభుత్వానికి మన కోరిక వినిపించడానికి రెండు మూడు రోజులు సమ్మె చేయాలి, కానీ నెలల తరబడి సమ్మె చేయడం భావ్యం కాదని తెలిపారు. అశ్వత్థామరెడ్డి వంటి నాయకులకు సత్తా ఉంటే ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి, రాష్ట్రపతి వద్దకు వెళ్లి డిమాండ్లు సాధించాలి, కానీ కార్మికులను విధులకు వెళ్లద్దనడం సమంజసం కాదన్నారు. నాయకుల మాటలు విని కుటుంబాలను నాశనం చేసుకోవద్దు. మనకు అన్నం పెట్టిన సంస్థ ఆర్టీసీని కాపాడుకోవాలని తోటి కార్మికులకు డ్రైవర్ రాజు విజ్ఞప్తి చేశాడు.

Comments