Skip to main content

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాంకేతికంగా వీలు కాదు: కన్నా స్పష్టీకరణ

 

బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ప్రత్యేక హోదా అంశంపై స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాంకేతికంగా వీలుకాదని స్పష్టం చేశారు. హోదా అంశాన్ని రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయని ఆరోపించారు. రాజకీయాలు ఎన్నికలప్పుడు మాత్రమే చేయాలని, ఇప్పడు రాష్ట్రాభివృద్ధికి అన్ని పార్టీలు కలసి రావాలని కన్నా పిలుపునిచ్చారు. 

రాష్ట్రంలో సమస్యలపై స్పందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్లే ఇసుక సమస్య ఉత్పన్నమైందని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నిర్మాణ రంగంపై ఆధారపడ్డ కుటుంబాలకు రూ.10 వేలు చొప్పున ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం పనుల ఆలస్యం, రీటెండరింగ్ పై కేంద్రం నివేదిక కోరిందని, నివేదిక తర్వాత రాష్ట్రంపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అన్నారు.

Comments