Skip to main content

చిదంబరం, డీకే శివకుమార్ ల బెయిల్ రద్దు చేయాలి: సుప్రీంకోర్టులో సీబీఐ, ఈడీ పిటిషన్లు



 ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరానికి ఇటీవల సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు, మనీ లాండరింగ్‌ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత డీకే శివకుమార్.. ఢిల్లీ హైకోర్టు నుంచి షరతులతో కూడిన బెయిల్ పొందారు. అయితే, వీరిద్దరి బెయిల్ లను రద్దు చేయాలని ఈ రోజు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.

చిదంబరం, డీకే శివకుమార్ ల బెయిల్ లను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో సీబీఐ, ఈడీ విడివిడిగా పిటిషన్ లు దాఖలు చేశాయి. కాగా, ఇటీవల రూ.లక్ష వ్యక్తిగత పూచి కత్తుపై సుప్రీంకోర్టు చిదంబరానికి బెయిల్‌ మంజూరు చేసినప్పటికీ ఆయన జైలునుంచి విముక్తి అయ్యే అవకాశం లేకుండాపోయింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసుకి సంబంధించిన ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఇప్పటికే అదుపులోకి తీసుకుంది.

మరోవైపు, ఈడీ విచారణలు ఎదుర్కొంటోన్న డీకే శివకుమార్‌ ఢిల్లీలోనే ఉంటున్నారు.  ఈ కేసులో తన తల్లి, భార్యకు ఈడీ జారీ చేసిన నోటీసుల నుంచి మినహాయింపు ఢిల్లీ హైకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ల విచారణలు ఈ నెల 31కు వాయిదా పడ్డాయి. ఆయన నిన్న సాయంత్రం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసానికి వెళ్లారు. అలాగే, కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీని కూడా కలిసి కేసుల విషయమై చర్చించారు. అంతకు ముందు కూడా కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్‌, అహ్మద్‌పటేల్‌లతో చర్చించారు.    

Comments

Popular posts from this blog

ఎలన్ మస్క్... స్టార్ షిప్ రెడీ... వచ్చే ఏడాది మార్స్ చెంతకు ప్రయాణం

మార్స్ గ్రహంపైకి వన్ వే ట్రిప్‌గా ఆసక్తి ఉన్న ప్రజలను పంపుతానని ప్రకటించిన ఆమెరికా బిలియనీర్ వ్యాపారి ఎలన్ మస్క్... అన్నంత పనీ చేస్తున్నారు. మనుషుల్ని చందమామ, మార్స్ చెంతకు తీసుకెళ్లడం కోసం ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్... సరికొత్త విమానం తరహా స్పేస్ షిప్‌లను తయారుచేస్తోంది. ఇవి రాకెట్‌‌లా కాకుండా... విమానం లాగా... అంతరిక్షంలోకి వెళ్లి... గ్రహాలపై మనుషుల్ని దించేసి... తిరిగి ఖాళీగా వెనక్కి వచ్చేస్తాయి. గ్రహాలపైకి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ఇందుకు రిటర్న్ ట్రిప్ అవకాశం కల్పించట్లేదు ఎలన్ మస్క్. వన్ వే ట్రిప్‌గా వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారే టికెట్ బుక్ చేసుకోమని సూచిస్తున్నారు. తాజాగా ఆయన ఆవిష్కరించిన స్పేస్‌షిప్‌లో వంద మంది ప్రయాణించేందుకు వీలుంది. టెక్సాస్... బోకా చికాలో... ఎంతో మంది అంతరిక్ష ఔత్సాహికులు, రిపోర్టర్ల సమక్షంలో చందమామ, మార్స్‌పైకి పంపే స్టార్ షిప్‌ను ఆవిష్కరించారు ఎలన్ మస్క్. వచ్చే ఆరు నెలల్లో దాన్ని అంతరిక్షంలో ఓ రౌండ్ వేయించి... వచ్చే ఏడాది మనుషులను అందులో పంపాలనుకుంటున్నారు ఎలన్ మస్క్. ఎప్పుడో పదకొండు ఏళ్ల కిందట ఫాల్కన్-1 రాకెట్‌ను తయారుచేసింది స్పేస్ ఎక...

క్రెడిట్ పై పెట్రోలును కొనుగోలు చేస్తే నో క్యాష్‌బ్యాక్‌

క్రెడిట్‌ కార్డులను వినియోగించి పెట్రోలును కొనుగోలు చేస్తే ఇన్నాళ్లూ లభిస్తున్న 0.75 శాతం క్యాష్‌బ్యాక్‌ అక్టోబరు ఒకటో తేది నుంచి ఉండబోదని కంపెనీలు ప్ర‌క‌టించాయి.  2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డిస్కౌంట్‌ ఇవ్వాలని చమురు కంపెనీలను కోరింది. దీంతో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి  2016 డిసెంబరు నుంచి క్రెడిట్‌, డెబిట్‌, ఈ-వాలెట్ల ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసే వారికి 0.75శాతం డిస్కౌంట్‌ను క్యాష్‌బ్యాక్‌ రూపంలో  ఇవ్వాల‌ని  చమురు కంపెనీలు క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించిన విష‌యం తెలిసిందే. కాగా వచ్చే నెల ఒకటో తేది నుంచి ఆ డిస్కౌంట్‌ ఉండబోదని తాజాగా కంపెనీలు వెల్లడించాయి. ఇకమీదట డెబిట్‌, ఇతర డిజిటల్‌ పద్ధతుల ద్వారా చెల్లించేవారికి మాత్రం ఈ డిస్కౌంట్‌ యధావిధిగా కొనసాగుతుంది.