అధికార పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకోవడం కంటే ప్రజల్లో పరపతిని సాధించి సత్తా చాటేందుకు విపక్షాలు ప్రయత్నం చేయాలని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ యాదవ్ చురకంటించారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో ఘన విజయం నేపథ్యంలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు.
ఎన్నికల ప్రచారం సందర్భంగా పేట్రేగిపోయిన విపక్ష నాయకులకు ఈ ఫలితాలు చెంపపెట్టన్నారు. తామే ప్రత్యామ్నాయమంటూ భీషణ ప్రతిజ్ఞలతో రెచ్చిపోయిన బీజేపీకి కనీసం ఓ వార్డు సభ్యునికి వచ్చిన ఓట్లు కూడా రాని విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అందువల్ల ముందు విపక్షాలు ప్రజల్లో పార్టీని బలపర్చుకుని అప్పుడు మాట్లాడాలని హితవు పలికారు.
Comments
Post a Comment