మరో సారి విజయవాడ వద్ద కృష్ణమ్మ ఉగ్ర రూపం దాల్చింది. ఈ ఉదయం ఆరున్నర లక్షలకు పైగా వరద నీరు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు ప్రవహిస్తూ ఉండటంతో, విజయవాడ, రామలింగేశ్వర నగర్ లోకి నీరు ప్రవేశించింది. దీంతో వందలాది పేదల ఇళ్లు నీట మునిగాయి. వరద నీరు నగరంలోకి ప్రవేశించకుండా ఏర్పాటు చేసిన గోడకు లీకులు ఏర్పడటం కారణంగానే నీరు వచ్చిందని అధికారులు తెలిపారు.
వరద తగ్గిన తరువాత మాత్రమే మరమ్మతులకు అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఈలోగా నీటిని తోడివేసేందుకు భారీ మోటార్లతో కూడిన యంత్రాలను వినియోగిస్తామని తెలిపారు. కాగా, ఇళ్లలోకి నీరు రావడంతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వరద మరింతగా పెరగవచ్చన్న అంచనాలతో అధికారులు అప్రమత్తం అయ్యారు. రేపటికి ప్రకాశం బ్యారేజ్ కి 8 లక్షల క్యూసెక్కుల వరకూ వరద రావచ్చని అంచనా.
Comments
Post a Comment