Skip to main content
ముకేశ్ అంబానీ ఇంట దీపావళి సందడి
ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ ఇంట మరోసారి సందడి మొదలైంది.
ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్‌లో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ
కార్యక్రమానికి ముంబయి ఇండియన్స్ జట్టు ఆటగాళ్లకు ఆహ్వానం అందింది.
ఆటగాళ్లు రోహిత్ శర్మ, జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్ తదితరులు వారి
సతీమణులతో ఈ వేడుకకు హాజరయ్యారు. వీరితో పాటు హార్దిక్ పాండ్య, కృనాల్
పాండ్య, మహేలా జయవర్దనే, ఆకాశ్ అంబానీ- శ్లోకా మెహతా, ఇషా అంబానీ-ఆనంద్
పిరమాల్, అజయ్-స్వాతి పిరమాల్‌లు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం వీటికి
సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Comments
Post a Comment