Skip to main content

నకిలీ మెయిల్ ఐడీ' కేసులో రవిప్రకాశ్ కు హైకోర్టు బెయిల్ మంజూరు



'నకిలీ మెయిల్ ఐడీ' కేసులో టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. టీవీ 9లో రూ.18 కోట్ల నిధుల అవకతవకల కేసులో ఆయన విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆయనకు ఆ కేసులో బెయిల్ వచ్చింది. ఆయనపై మరిన్ని కేసులు కూడా నమోదయ్యాయి. ఐ ల్యాబ్ పేరుతో నటరాజన్ అనే వ్యక్తి పేరు మీద ఆయన నకిలీ ఐడీ సృష్టించడంతో ఇటీవల సీసీఎస్ పోలీసులు 406/66 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

ఐ ల్యాబ్స్‌ గ్రూప్‌ అధ్యక్షుడు టి.కృష్ణప్రసాద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసులో దర్యాప్తు జరుపుతున్నారు. నకిలీ ఈ-మెయిల్‌ సృష్టించి నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ను తప్పుదోవ పట్టించేందుకు ఆయన ప్రయత్నించారని ఆరోపణలున్నాయి. ఈ రోజు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు... కూకట్ పల్లి కోర్టులో పూచికత్తు సమర్పించాలని ఆదేశించింది.

Comments