Skip to main content

సి యమ్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చిన సలహా వింటే అందరు షాక్ అవుతారు.


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రాజకీయపరమైన సలాహా ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌తో కలవొద్దని సూచించారు. ‘జగన్‌కు చెబుతున్నా.. ఇలాంటి కార్మిక వ్యతిరేకి, ఇద్దరు ఆర్టీసీ కార్మికులు చావడానికి కారణమైన కేసీఆర్‌తో కలువకు.. కలిస్తే మీ పేరు, మీ నాన్న పేరు కూడా చెడిపోతుంది. ఇలాంటి దుర్మార్గుల్ని కలవొద్దని కోరుతున్నా’అన్నారు కోమటిరెడ్డి. ఆర్టీసీ సమ్మె విషయంలో స్పందించిన ఆయన.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
credit: third party image reference
ఆర్టీసీ కార్మికుల సమస్యలకు కేసీఆర్‌కు పట్టవా అని ప్రశ్నించారు కోమటిరెడ్డి. ఆర్టీసీ డ్రైవర్లు బలి దానాలు చేసుకున్నా కనీసం స్పందించకపోవడం దారుణం అన్నారు. ఆర్టీసీ కార్మికులు ధైర్యంగా ఉండాలని.. తాము అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఏపీలో లోటు బడ్జెట్.. ఇక్కడ మిగులు బడ్జెట్ ఉందని.. అయినా అక్కడి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని గుర్తు చేశారు వెంకటరెడ్డి.
credit: third party image reference
కేసీఆర్ నెలకోసారి జగన్‌మోహన్‌రెడ్డిని పిలిపించుకొని.. ఆయనేదో గెలిపించుకున్నట్లు ఫీలవుతున్నారని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేసిన సేవలు.. జగన్ పడిన కష్టంతోనే ఎన్నికల్లో విజయం సాధించారని.. కేసీఆర్ బతికున్నా కూడా బిడ్డను గెలిపించుకోలేకపోయిన అసమర్థుడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించలేదన్నారు.

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.