అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో సుప్రీంకోర్టు విచారణను ముగించింది. దాదాపు 40 రోజుల పాటు ఏకధాటిగా సుప్రీంకోర్టు ఈ కేసును విచారించింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సారథ్యం వహించిన ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం వైరి పక్షాల వాదనలను విన్నది.
ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు వాదనలను వింటామని సుప్రీంకోర్టు ప్రకటించినప్పటికీ... ఒక గంట ముందే అంటే 4 గంటలకే విచారణ ముగిసినట్టు ప్రకటించింది. ఇంతకు మించి వినడానికి ఏమీ లేదని తెలిపింది. తీర్పును రిజర్వ్ లో ఉంచింది. నవంబర్ 17న ప్రధాన న్యాయమూర్తిగా రంజన్ గొగోయ్ పదవీ విరమణ చేయనున్నారు. ఈ లోగానే తీర్పును వెలువరించే అవకాశాలు ఉన్నాయి.
Comments
Post a Comment