ఐఎన్ఎక్స్ మీడియా కేసులోని నగదు అక్రమ చలామణికి సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరంను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. చిదంబరంను బుధవారం ఉదయం విచారించేందుకు జైల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని జైలు అధికారులను ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్ కుహార్ ఆదేశించారు.
ఐఎన్ ఎక్స్ మీడియా కేసులో ఆయన ప్రస్తుతం తిహా జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయాన్నే ముగ్గురు ఈడీ అధికారులు జైలుకు చేరుకొని దాదాపు గంటపాటు ఆయన్ను ప్రశ్నించారు. అనంతరం అరెస్టు చేశారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో 55రోజుల సీబీఐ జ్యుడీషియల్ కస్టడీ తర్వాత చిదంబరాన్ని ఈడీ అరెస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఆయనను అరెస్టు చేసేందుకు ఈడీ అధికారులకు ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం అనుమతినిచ్చిన విషయం తెలిసిందే
Comments
Post a Comment