నేతలు, కార్యకర్తల వలసలపై మాట్లాడిన జేసీ పోలీసుల కేసులు భరించలేక టిడిపి కార్యకర్తలు వైసిపిలో చేరుకున్నారని అన్నారు.
మాజీ ఎంపీ, టిడిపి సివియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి వీలు చిక్కినప్పుడల్లా సిఎం జగన్ పై తనదైన శైలిలో స్పందిస్తుంటారు. తాజాగా మరోసారి జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జగన్ కు పరిపాలన అనుభవం లేదని, ఆయనకు మంచి చెడు చేప్పేవాళ్ళు లేరని వ్యాఖ్యానించారు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్న చందంగా పరిపాలన సాగిస్తున్నారని సెటైర్లు వేశారు. జగన్ నరేంద్ర మోడీ దయ వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ భారీ మెజార్టీతో గెలిచారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . నరేంద్ర మోడీ చేతిలో ఉన్న మంత్రదండం షిర్డీ సాయి కన్నా శక్తివంతమైనదని అభిప్రాయపడ్డారు. ఒక వైపు చురకలంటిస్తూనే జగన్ మంచీచెడు రెండు చేస్తున్నాడని అభిప్రాయపడడు.
Comments
Post a Comment