Skip to main content

విద్యుత్‌ సౌధలో కేంద్ర, రాష్ట్ర అధికారులతో వర్క్‌షాప్‌ నిర్వహణ వ్యయం తగ్గుతుందన్న అధికారులు ప్రైవేటీకరణకు బాటలు వేయడమేనన్న ఉద్యోగ సంఘాలు

సబ్‌స్టేషన్ల ఆటోమేషన్‌పై తొలిఅడుగు!

 ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల ఆటోమేషన్‌కు తొలి అడుగు పడింది. కేంద్ర విద్యుత్‌ సంస్థల సాయంతో ఇక్కడి 400 కేవీ సబ్‌ స్టేషన్లలో ఆటోమేషన్‌ టెక్నాలజీని అమలు చేయాలని నిర్ణయించిన ట్రాన్స్‌కో అధికారులు మంగళవారం ఇక్కడ విద్యుత్‌ సౌధలో దీనిపై వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ టెక్నాలజీని అందిస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ.. పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ అధికారులు కూడా దీనికి హాజరయ్యారు. సబ్‌స్టేషన్లలో ఈ టెక్నాలజీని అమలు చేస్తే రిమోట్‌ కంట్రోల్‌తో మొత్తం విద్యుత్‌ వ్యవస్థను నిర్వహించవచ్చని, కంట్రోల్‌ రూం నుంచే మొత్తం వ్యవస్ధను పర్యవేక్షిస్తూ సరఫరా నష్టాలు తగ్గించుకొనే అవకాశం ఉందని పవర్‌ గ్రిడ్‌ అధికారులు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేసే లక్ష్యంతో ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టే విషయం పరిశీలిస్తున్నామని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ పేర్కొన్నారు. ‘విద్యుత్‌ వ్యవస్ధలో సబ్‌ స్టేషన్లు అత్యంత ప్రధానమైన వ్యవస్థ. ఆటోమేషన్‌ విధానం వల్ల మొత్తం సరఫరా వ్యవస్ధ పనితీరు, విశ్వసనీయత పెరుగుతాయి. సమస్యల పరిష్కార సామర్థ్యం పెరుగుతుంది. సరఫరా నష్టాలు తగ్గుతాయి.
వినియోగదారులకు నాణ్యమైన కరెంటు అంతరాయాలు లేకుండా అందుతుంది. సబ్‌ స్టేషన్ల నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. సబ్‌స్టేషన్ల నిర్వహణలో లోపాలు కూడా తగ్గుతాయి. ఈ అధునాతన టెక్నాలజీ సబ్‌ స్టేషన్లలోని అన్ని పరికరాలనూ పర్యవేక్షిస్తుంది. రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా రాష్ట్ర స్థాయి నుంచే అంతా పర్యవేక్షించడం వీలు పడుతుంది’ అని చెప్పారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడం ద్వారా సింగపూర్‌, జర్మనీ వంటి దేశాలు సరఫరా నష్టాలను గణనీయంగా తగ్గించుకోగలుగుతున్నాయని, అలాంటి విధానాలనే ఇక్కడా అమలు చేయాలని ప్రయత్నిస్తున్నామని ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్‌బాబు తెలిపారు. ఈదురు గాలులు, తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో.. లైన్లలో ఏర్పడిన సమస్యలు, లోపాలను ఆటోమేషన్‌ వ్యవస్థ నిర్దిష్టంగా గుర్తిస్తుందని, దీనివల్ల తక్కువ సమయంలో వాటిని పరిష్కరించడం వీలవుతుందని చెప్పారు. వినియోగదారులకు కరెంటు వాడకం లెక్కలు సులభంగా తెలుస్తాయన్నారు. తాము ఈ టెక్నాలజీ ద్వారా దేశవ్యాప్తంగా 765 కేవీ, 400 కేవీ సబ్‌ స్టేషన్లను నిర్వహిస్తున్నామని, అందులో 400కేవీ స్టేషన్లన్నీ పూర్తిగా ఆటోమేషన్‌తోనే నడుస్తున్నాయని పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ అధికారులు వివరించారు. సదస్సులో పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ టీఎ్‌ససీ శర్మ, ఢిల్లీ సీజీఎం వింధాల్‌, హైదరాబాద్‌ సీజీఎం అవినాశ్‌, ఏపీ ట్రాన్స్‌కో చీఫ్‌ ఇంజనీర్లు పాల్గొన్నారు.
ఉద్యోగ సంఘాల నిరసన
సబ్‌స్టేషన్ల ఆటోమేషన్‌ ప్రయత్నంపై ఈ వర్క్‌షాప్‌లో ఉద్యోగ సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేసినట్లు సమాచారం. సబ్‌స్టేషన్లలో సిబ్బందిని పూర్తిగా తొలగించి ఆటోమేషన్‌ ద్వారా వాటిని నిర్వహించే ప్రయత్నం చేయడమంటే.. పరోక్షంగా వాటిని ప్రైవేటీకరించడమేనని వారు ఆరోపించారు. దీనివల్ల విద్యుత్‌ సంస్థల్లో ఇంజనీర్ల నియామకం కూడా నిలిచిపోతుందని, సిబ్బందిని పెద్ద ఎత్తున తొలగించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు సబ్‌ స్టేషన్ల ప్రైవేటీకరణకు ప్రయత్నించినప్పుడు అడ్డుకొన్నామని, ఇప్పుడు కూడా దీనిని అంగీకరించే ప్రసక్తే లేదని వారు పేర్కొన్నట్లు సమాచారం.

Comments

Popular posts from this blog

అమృత ప్రేమలో పడిన విరాట్ మనసులో మాట.. ఈ పాట' అంటూ కొత్త సినిమా సాంగ్ విడుదల చేసిన సాయితేజ్‌

 అంత స్ట్రిక్ట్‌గా సోలో బ్రతుకు సో బెటర్ అని అందరికీ చెప్పే విరాట్ కి అమృత ని చూశాక ఏమైంది?' అంటూ నిన్న సోలో బతుకే సో బెటరు సినిమాలోంచి ఓ పోస్టర్‌ను విడుదల చేసిన మెగా హీరో సాయితేజ్‌ ఈ రోజు ఈ సినిమాలోని పాటను విడుదల చేశారు. 'అమృత ప్రేమలో పడిన విరాట్ మనసులో మాట... ఈ పాట...' అంటూ సాయితేజ్‌ కామెంట్ చేశాడు. 'హేయ్  నేనేనా' అంటూ సాగే ఈ పాట అలరిస్తోంది. సుబ్బు డైరక్షన్ లో సోలో బతుకే సో బెటరు సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోంచి 'నో పెళ్లి' సాంగ్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే.                            

రాజధానిపై వచ్చేనెల 21వరకు స్టేటస్‌ కో

  రాజధాని అంశాలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. వచ్చే నెల 21 నుంచి రోజు వారీ విచారణపై న్యాయవాదులతో ధర్మాసనం చర్చించింది. భౌతిక దూరం పాటిస్తే హైకోర్టులోనే విచారణ జరిపేందుకు సిద్ధమని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. రాజధాని, సీఆర్డీఏ చట్టం రద్దుపై  గతంలో హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌ కో ఉత్తర్వులు ఇవాళ్టితో ముగిశాయి. దీంతో సెప్టెంబరు 21 వరకు స్టేటస్‌ కో అమలు గడువును పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాజధాని బిల్లులు అమలు చేయకుండా స్టేటస్‌ కో కొనసాగుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ సెప్టెంబరు 21కి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరఫు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది నితీశ్‌ గుప్తా కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. విశాఖలోని కాపులుప్పాడలో రాష్ట్ర ప్రభుత్వం భారీ అతిథిగృహాన్ని నిర్మించ తలపెట్టిందని, స్టేటస్‌ కో అమల్లో ఉన్నప్పుడు అతిథిగృహ నిర్మాణానికి శంకుస్థాపన ఏంటని పిటిషనర్‌ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కార్యనిర్వాహక రాజధాని తరలింపులో ఇది కూడా భాగమేనని వాదనలు వినిపించారు. రాష్ట్రపతి...