Skip to main content

తాగునీరు అందించేందుకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం: మంత్రి పేర్ని నాని

 



ఏపీ కేబినేట్ సమావేశం ముగిసింది. సీఎం జగన్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో కొత్త సంక్షేమ పథకాల విధివిధానాలపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, కేబినెట్ తీసుకున్న నిర్ణయాల గురించి వివరించారు. అందరికీ సురక్షితమైన మంచినీరు ఇచ్చేందుకు వాటర్ గ్రిడ్ ఏర్పాటు, తాగునీరు అందించేందుకు ప్రత్యేక కార్పొరేషన్, పొరుగు సేవల ఉద్యోగాల కోసం ప్రత్యేక కార్పొరేషన్, సాధారణ పరిపాలన శాఖ అజమాయిషీలో పొరుగు సేవల కార్పొరేషన్, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బోర్లు వేసేందుకు రిగ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.

వైఎస్సార్ చేనేత నేస్తం పేరుతో ఏటా రూ.24 వేలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని, ఈ పథకానికి రూ.216 కోట్లు ఖర్చు అవుతుందని అంచనాగా ఉన్నట్టు చెప్పారు. వైఎస్సార్ చేనేత నేస్తం కింద ఒకేసారి రూ.24 వేలు సాయం చేయాలని, ఏటా డిసెంబరు 21న చేనేత కుటుంబాలకు బ్యాంకు ద్వారా ఆర్థిక సాయం అందించాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు కార్పొరేషన్ల ద్వారా వాహనాలు కొనేందుకు నిరుద్యోగులకు రుణాలు ఇవ్వాలని, హోంగార్డులకు ఇచ్చే రోజువారీ జీతభత్యం రూ.710కు, మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం రూ.3 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. మత్స్యకార కుటుంబాలకు ఇచ్చే ఆర్థికసాయం పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపిందని, నవంబరు 21 నుంచి అమలు చేస్తామని, ఇంకా పలు నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పారు.   

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.