Skip to main content

ఏపీఎస్ఆర్టీసీ పేరు మారనుందా.. మరి కొత్త పేరేంటి..


 అఖండ విజయంతో అధికారంలోకి వచ్చిన జగన్ వచ్చిన వెంటనే తను ఇచ్చిన హామీల పై ఫోకస్ పెట్టారు. వాటిలో ఒకటి ఆర్టీసీ విలీనం. ఏపీఎస్ ఆర్టీసీ విలీనం పై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా ఈ ఏడాది జూన్ 14న ఆరు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రిటైర్డ్ ఐపీఎస్ ఆంజనేయ రెడ్డి ఆధ్వర్యంలో ఉంది. 

ఇటీవల ఈ కమిటీ ఆర్టీసీ విలీనం సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. నివేదికను పరిశీలించిన జగన్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులు మరియు కార్మికులను ప్రభుత్వం లో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ విలీనం లో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ పేరును కూడా మార్చాలని ఈ కమిటీ నివేదిక అందజేసింది. దీంతో ఇకపై ఏపీఎస్ఆర్టీసీ పేరును ప్రజా రవాణా శాఖ గా మారుస్తున్న ట్లు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంపీ కృష్ణ బాబు పేర్కొన్నారు.

 ఉద్యోగులకు వేతనాలు ఎంత ఉండాలి వారికి ఏ స్థాయి కల్పించాలి పాలనా యంత్రాంగం ఎలా ఉండాలి అనే అంశంపై అధ్యయనానికి ప్రభుత్వం ఆరుగురు నిపుణులతో కమిటీ వేసింది. దీనికి రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్గా ఉంటారు. ప్రభుత్వంలో ఏపీఎస్ ఆర్టీసీ విలీనం తర్వాత అధికారికంగా ఆర్టీసీ పేరును మార్పును అమలులోకి తీసుకు వస్తామన్నారు.

Comments