ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఝలక్ ఇచ్చారు. విశాఖపట్నంలోని పరదేశిపాలెంలో తెలుగుదేశం ప్రభుత్వం కేటాయించిన ఎకరన్నర భూమిని జగన్ సర్కార్ రద్దు చేసింది. ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు అప్పనంగా తన సన్నిహితులకు కట్టబెట్టిన భూములను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీని విలువ నలభై కోట్లు ఉంటుందని మంత్రి పేర్నినాని తెలిపారు. అయితే ఆంధ్రజ్యోతి యాజమాన్యం మాత్రం ప్రభుత్వం అవాస్తవాలను చెబుతుందని తేల్చింది. తమకు ప్రభుత్వం అప్పనంగా భూమిని కేటాయించలేదని చెప్పింది. 1986లోనే నాటి ప్రభుత్వం ఆంధ్రజ్యోతికి భూమిని కేటాయించిందని, అయితే రోడ్డు విస్తరణలో ఎకరం భూమి కోల్పోవడంతో తిరిగి పరదేశి పాలెంలో ఎకరన్నర భూమిని కేటాయించినట్లు పేర్కొంది.
- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment