Skip to main content

మన్మోహన్ సింగ్- రాజన్ హయాంలో బ్యాంకుల పరిస్థితి అధ్వానం: అర్థిక మంత్రి నిర్మలా సీతారామన్







యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వరంగ బ్యాంకులు పరిస్థితి అధ్వానంగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. ముఖ్యంగా ప్రధానమంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా రఘురామ్ రాజన్ ఉన్న సమయంలో బ్యాంకుల పరిస్థితి దిగజారిందని అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల బలహీన పరిస్థితికి వీరిద్దరే కారణమని ఆమె చెప్పారు. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్ సదస్సులో నిర్మల పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ‘రాజన్ చెపుతున్నమాటలు, ఆయన భావనలను విశ్వసిస్తున్నా. ఆయనను గౌరవిస్తున్నా. ఈరోజు నేను మీకు ఒక నిజం చెబుతున్నాను. ప్రధానిగా మన్మోహన్, ఆర్ బీఐ గవర్నర్ గా రఘురామ్ రాజన్ ఉన్న సమయంలో ప్రభుత్వ బ్యాంకులు బలహీనంగా మారాయన్నదాంట్లో సందేహం లేదు. ఆ సమయంలో ఎవరూ కూడా ఈ విషయాన్ని గుర్తించలేకపోయారని పేర్కొన్నారు.

2014 నాటికి పీఎస్ బీ వసూలు కాని రుణాలు పెరిగాయి
2011-12 లో వసూలు కాని రుణాలు  రూ.9,190 కోట్లు ఉండగా, 2013-14 నాటికి అవి రూ.2.16 లక్షల కోట్లకు పెరిగాయని ఆర్ బీఐ పేర్కొందని నిర్మల పేర్కొన్నారు. ‘2014 మే నెలలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటికే పీఎస్ బీల పరిస్థితి దిగజారిన విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. దేశంలో ఆర్థిక వ్యవస్థ మందగమనంపై నేను విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ పలు రంగాల్లో ఉత్తేజం తెచ్చేందుకే కార్పొరేట్ టాక్స్ లో కోతను ప్రకటించాం.ఇది ద్రవ్య లోటును పెంచే ప్రమాదం ఉన్నప్పటికి ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజాన్ని అందించే లక్ష్యంగా నిర్ణయం అమలుకే మొగ్గు చూపాం’ అని వివరించారు.

యూపీఏ హయాంలో ఫోన్ చేస్తే రుణాలిచ్చారు


యూపీఏ తన హయాంలో రుణాలిచ్చే సమయంలో అనుసరించిన విధానాన్ని నిర్మల తూర్పార బట్టారు. రాజన్ హయాంలో కేవలం ఫోన్ కాల్స్ చేస్తేనే తమకు అనుకూలమైన  ప్రభుత్వ బ్యాంకులకు, సంస్థలకు రుణాలు ఇచ్చేవారని నిర్మలా శ్రోతల నవ్వుల మధ్య చెప్పారు. అప్పటి ప్రభుత్వ అసమర్థ విధాలనాల వల్ల ఏర్పడ్డ పరిస్థితి నుంచి బయటపడటానికి తాము ప్రభుత్వం ఈక్విటీలను నమ్ముకోవాల్సి వచ్చిందని చెప్పారు.   

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.