మహేశ్ బాబు కొత్తం చిత్రం ట్రైలర్లు, టీజర్లు, ఫస్ట్ లుక్ పోస్టర్లు రికార్డులు సృష్టించడం సాధారణ విషయమే. అయితే ఆయన తన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఉపయోగించిన #HBDMaheshBabu అనే హ్యాష్ ట్యాగ్ తో ఏకంగా ప్రపంచ రికార్డు కొట్టేశారు. ట్విట్టర్ లో ఈ హ్యాష్ ట్యాగ్ ఉపయోగిస్తూ 24 గంటల వ్యవధిలో 60.2 మిలియన్ల ట్వీట్లు వచ్చాయట. ఇప్పటివరకు ఇదే హయ్యస్ట్ అని, ఇది ప్రపంచ రికార్డు అని మహేశ్ బాబు పీఆర్ టీమ్ వెల్లడించింది. ఇవాళ మహేశ్ బాబు పుట్టినరోజు కావడంతో ఇంకా ట్వీట్లు వస్తూనే ఉన్నాయని, ఈ ట్వీట్ల సంఖ్య దూసుకుపోవడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.
Comments
Post a Comment