Skip to main content

నేనెంత అదృష్టవంతుడినో.. : మహేష్ బాబు


ఆగస్ట్ 9న పుట్టిన రోజు జరుపుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, తనకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు, మీరందరూ నా మీద చూపించే ఈ ప్రేమ నేనెంత అదృష్టవంతుడినో నాకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఎంతో అభిమానంగా పంపిన మీ విషెస్ చదువుతుంటే చాలా ఆనందంగా ఉంది. నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు మరియు ఫ్యాన్స్‌కు మీరు పంపిన అభినందనలకు, దీవెనలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. - ప్రేమతో మీ మహేష్ బాబు.’’ అని మహేష్ బాబు కృతజ్ఞతలు తెలిపారు.

60.2 మిలియన్ ట్వీట్స్‌తో వరల్డ్ రికార్డ్ సృష్టించిన సూపర్ స్టార్ మహేష్ బర్త్‌డే ట్రెండ్

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా అభినందనలు తెలుపుతూ అభిమానులు ట్విట్టర్‌లో #HBDMaheshBabu హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేశారు. 60.2 మిలియన్ ట్వీట్స్‌తో 24 గంటల్లో ప్రపంచంలోనే అత్యధికంగా ట్వీట్ చేయబడిన హ్యాష్ ట్యాగ్‌‌గా రికార్డ్ సృష్టించింది. ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం అయిన ట్విట్టర్‌లో ఈ వరల్డ్ రికార్డ్ సాధించడంతో అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కను నాటి అభిమానులందరూ ఈ పర్యావరణ కార్యక్రమంలో భాగం కావాలని పిలుపునిచ్చారు. మహేష్ బాబు జన్మదిన సందర్భంగా తన కొత్త చిత్రం ‘సర్కారు వారి పాట’ నుంచి విడుదలైన మోషన్ పోస్టర్ ట్రెమండస్ రెస్పాన్స్‌తో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ప్రస్తుత కరోనా సంక్షోభం తగ్గుముఖం పట్టగానే సూపర్ స్టార్ మహేష్ ‘సర్కారు వారి పాట’ షూటింగ్ ప్రారంభం కానుంది.

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...