ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తూనే ఉంది.. ఏకంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెండు కోట్లు దాటిపోయింది... ఇక, ప్రపంచంలోని ఇతర దేశాల కంటే భారత్‌లోనే కరోనా కేసులు సంఖ్య యమ స్పీడ్‌గా దూసుకెళ్తోంది.. ప్రస్తుతం దేశంలో ప్రతీరోజూ 60 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ ఏకంగా పాజిటివ్ కేసులు 62 వేలు దాటిపోయింది.. కరోనా గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2,00,23,016కు చేరగా.. ఇప్పటివరకు మృతిచెందినవారి సంఖ్య 7,33,973కి పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 3 లక్షల కొత్త కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు, కరోనాబారినపడి కోలుకున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా.. ఇప్పటి వరకు 1,28,97,813 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రపంచంలో కరోనా కేసుల్లో అగ్రరాజ్యం అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతూనే ఉంది. అమెరికాలో ఇప్పటివరకు 51,99,444 మంది కరోనా బారినపడ్డారు. వారిలో 26,64,701 మంది కోలుకున్నారు. 23,69,126 మంది చికిత్స పొందుతున్నారు. ఇక, ఇప్పటివరకు 1,65,617 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండియాలో పాజిటివ్ కేసుల సంఖ్య 22,15,075గా ఉంది. ఇప్పటివరకు 44,386 మంది కరోనాతో మృతిచెందారు.
Comments
Post a Comment