Skip to main content

డర్టీ పిక్చర్` చేస్తానంటే తిట్టారు: విద్యా బాలన్


అప్పటివరకు పక్కింటమ్మాయి తరహా పాత్రల్లో కనిపించిన విద్యా బాలన్ `డర్టీ పిక్చర్`తో ఒక్కసారిగా గేర్ మార్చింది. ఆ సినిమాలో అత్యంత హాట్‌గా నటించి అందరికీ షాకిచ్చింది. అలనాటి శృంగార తార సిల్క్ స్మిత జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో విద్య అత్యద్భుతంగా నటించి మెప్పించింది. 

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో `డర్టీ పిక్చర్` గురించి విద్య మాట్లాడింది. `నేను `డర్టీ పిక్చర్`కు సంతకం చేశానని తెలిసి చాలా మంది తిట్టారు. నాకు పిచ్చి పట్టిందనుకున్నారు. `నవ్వు ఇలాంటి పాత్రలు చేయకూడద`ని కొందరు చెప్పారు. కానీ, నాకు సినిమాపై నమ్మకముంది. ఆ సినిమా నిర్మాత ఏక్తా కపూర్ కూడా ఓ మహిళే. ఆ సినిమా చెత్తగా ఉండదని నాకనిపించింది. `డర్టీ పిక్చర్` సినిమా కథ మా తల్లిదండ్రులకు చెప్పి.. `చేయాలా? వద్దా?` అని అడిగాను. `నీకు సరైనదని అనిపిస్తే కచ్చితంగా చెయ్యి` అని వాళ్లు చెప్పారు. దాంతో నేను ఆలోచించుకుని ఆ సినిమాకు ఓకే చెప్పాన`ని విద్య తెలిపింది. 

Comments