Xiaomi 10 వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా Xiaomi Mi 10 Ultra మరియు Redmi K30 Ultra స్మార్ట్ ఫోన్లను ఆగస్టు 11 న చైనాలో విడుదల చేయబతోంది. షియోమి ఈ రెండు ఫోన్స్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది మరియు స్టోరేజ్ వేరియంట్స్ మరియు కలర్ ఆప్షన్స్‌తో పాటు మరికొన్ని కీలక వివరాలను ఇప్పటికే ప్రకటించింది. కేవలం, స్మార్ట్ ఫోన్లు మాత్రమే కాకుండా షియోమి 55-అంగుళాల OLED TV మరియు 55W ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జర్‌ను కూడా విడుదల చేయనుంది.
మి 10 సిరీస్ మరియు రెడ్‌మి కె 30 సిరీస్ రెండూ కూడా ఈ ఏడాది ప్రారంభం మార్చిలో ప్రపంచవ్యాప్తంగా ప్రకటించబడ్డాయి. అయితే, ఈ కొత్త ‘అల్ట్రా’ వేరియంట్లను అధిక రిఫ్రెష్ రేట్ డిస్ప్లే మరియు బాక్స్ తో పాటుగా అడ్వాన్స్‌డ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇవ్వడం వంటి కొత్త అప్డేట్స్ ను కూడా అందించాలని చూస్తోంది. రాబోయే ఈ మి 10 అల్ట్రా యొక్క కొన్ని పోస్టర్లు ఇప్పటికే Leak అయ్యాయి. ఇందులో, 120 Hz లేదా 144 Hz హై-రిఫ్రెష్-రేట్ డిస్ప్లే మరియు 120x డిజిటల్ జూమ్ పెరిస్కోప్ కెమెరాతో తీసుకువస్తోంది. అదేవిధంగా, రెడ్‌మి కె 30 ప్రో లోని 90 హెర్ట్జ్ ప్యానెల్ నుండి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లేలో వరకూ రెడ్‌మి కె 30 అల్ట్రా ని ప్యాక్ చేయడానికి సిద్ధంగా ఉంది.
లీకైన ఫీచర్లు మరియు రూమర్ల ఆధారంగా మి 10 అల్ట్రా మరియు రెడ్‌మి కె 30 అల్ట్రా గురించి క్లుప్తంగా చూద్దాం.
Xiaomi Mi 10 Ultra: లీక్డ్ స్పెసిఫికేషన్స్
కొన్ని లీక్స్ ప్రకారం, Xiaomi Mi 10 Ultra మరియు ట్రాన్స్పరెంట్ ఎడిషన్ అనే రెండు రంగులలో వస్తుందని భావిస్తున్నారు. అధికారికంగా కనిపించే కొన్ని బ్యానర్స్ ఆన్ లైన్ లో కనిపించాయి. మి 10 ప్రో నుండి టెలి ఫోటో లెన్స్‌కు బదులుగా పెరిస్కోప్ లెన్స్ దీని రూపంలో గుర్తించదగిన మార్పులలో ఒకటి. ఈ పెరిస్కోప్ లెన్స్ 120x డిజిటల్ జూమ్ వరకు మద్దతునిస్తుంది, ఇది ఫోన్ లాంచ్ అయినప్పుడు ఆకట్టుకునే విషయం అవుతుంది. మిగతా మూడు కెమెరాలు మి 10 ప్రోలో మాదిరిగానే ఉంటాయని భావిస్తున్నారు.
మి 10 అల్ట్రా 120 హెర్ట్జ్ హై రిఫ్రెష్ రేట్‌తో FHD + అమోలెడ్ స్క్రీన్‌ను కలిగి ఉంటుందని పుకారు ఉంది. డిఇ స్క్రీన్ పరిమాణం కూడా పెద్దగా ఒక 6.67-అంగుళాల వద్ద ఉంటుంది మరియు HDR10 + ధృవీకరించబడింది. ఇది UFS 3.1 స్టోరేజ్ మరియు LPDDR 5 ర్యామ్ తో జత చేసిన సరికొత్త క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 865 + చిప్ సెట్ యొక్క శక్తితో పనిచేస్తుందనే , రూమర్ కూడా. మెరుగైన లిక్విడ్ కూలింగ్ రూమ్ ఉన్నట్లు కూడా ఫోన్ లీక్ చేయబడింది, ఇది ఫోన్ యొక్క ఉష్ణోగ్రతను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.
ఈ ఫోన్ 4,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో 100W లేదా 120W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో తీసుకురావచ్చు. ఇది 55W ఫాస్ట్ వైర్ లెస్ ఛార్జర్‌తో అనుకూలంగా ఉంటుంది. బహిర్గతమైన కొంత సమాచారం ప్రకారం, వైట్ కలర్ లో ఉన్న మి 10 అల్ట్రా 8 జిబి ర్యామ్ / 256 జిబి స్టోరేజ్ మరియు 12 జిబి / 256 జిబి స్టోరేజ్‌తో అందించబడుతుంది, ట్రాన్స్పరెంట్ వేరియంట్ 12 జిబి / 256 జిబి మరియు 16 జిబి / 512 జిబి ఆప్షన్లలో వస్తుంది.
Redmi K30 Ultra: లీక్ స్పెసిఫికేషన్స్
రెడ్‌మి కె 30 అల్ట్రా కె 30 ప్రో ఒక 6.67-అంగుళాల అమోలెడ్ స్క్రీన్‌తో 120 హెర్ట్జ్ హై-రిఫ్రెష్ రేట్ మరియు పాప్-అప్ సెల్ఫీ కెమెరాను కలిగి వుంటుంది. ఈ కె 30 అల్ట్రా ఆక్టా-కోర్ సిపియుతో MediaTek Dimesnity 1000+ చిప్ సెట్ యొక్క శక్తితో వస్తుందనే పుకారు ఉంది. ఇది 6GB RAM + 128GB స్టోరేజ్ , 8GB / 128GB లేదా 512GB స్టోరేజ్ వేరియంట్ తో జత చేయవచ్చు.
రెడ్‌మి కె 30 అల్ట్రా వెనుక భాగంలో 64 ఎంపి క్వాడ్-కెమెరా సెటప్‌తో పాటు 5 ఎంపి టెలిఫోటో కెమెరా, 13 ఎంపి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపి డెప్త్ సెన్సార్‌తో వస్తాయని ఊహిస్తున్నారు. ముందు భాగంలో, పైన 20MP సెల్ఫీ కెమెరా పాప్-అప్ మెకానిజంలో ఉంది.
ఇది 4,400 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తుంది, ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్-ది-బాక్స్ కొరకు మద్దతు ఇస్తుంది. ఆగస్టు 11 న జరగనున్న లాంచ్ సందర్భంగా కొత్త స్మార్ట్ ఫోన్ గురించి మరిన్ని వివరాలు మాకు తెలుస్తాయి.
Comments
Post a Comment