Skip to main content

తల్లి కోసం చేపల వేపుడు చేసిన చిరంజీవి... వీడియో ఇదిగో!

వీడియో చూడండి: https://youtu.be/vvos3-aaQnk


 టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఖాళీ సమయాల్లో చేసే పనుల్లో కుకింగ్ కూడా ఉంటుంది. తాజాగా ఆయన తన తల్లి అంజనాదేవి కోసం చిన్న చేపల వేపుడు చేశారు. వాస్తవానికి దీనికి సంబంధించిన వీడియోను నిన్న సాయంత్రమే విడుదల చేస్తానని చిరంజీవి ప్రకటించినా, విజయవాడ అగ్నిప్రమాదం ఘటన నేపథ్యంలో ఆ వీడియోను ఇవాళ ఉదయం రిలీజ్ చేశారు. చెప్పినట్టుగానే చింత తొక్కుతో చిన్న చేపలను మారినేట్ చేసి, వాటిని ఎంతో నేర్పుగా వేపుడు చేసి తల్లికి వడ్డించారు. తన చేతి వంటను ఎంతో ఇష్టంగా తింటున్న మాతృమూర్తిని చూస్తూ చిరంజీవి మురిసిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Comments