Skip to main content

ప్రధాని మోదీకి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అభినందనలు‌


లక్ష కోట్ల రూపాయలతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ఈ నిధి రైతులు పండించిన పంటలకు విలువను జోడించడానికి మరియు స్థిరమైన ఉన్నత స్థాయి ఆదాయాలు పొందటానికి వీలు కల్పిస్తుందని అన్నారు. తద్వారా మన వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ మెరుగు పడేందుకు తోడ్పడుతుందని సీఎం వైయ‌స్‌ జగన్‌ ఆకాక్షించారు. ఈమేరకు ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.  

కాగా, వ్యవసాయ రంగంలో స్వావలంబన దిశగా వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధికి కేంద్రం తీసుకొచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధానమంత్రి కిసాన్‌ యోజన పథకం కింద రూ.లక్ష కోట్లతో ఈ నిధిని ఏర్పాటు చేశారు. దీనిద్వారా దేశంలోని సుమారు 8.5 కోట్ల మంది రైతులకు 2 వేల రూపాయల చొప్పున రూ.17 వేల కోట్లు పంపిణీ చేయనున్నారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద పంట దిగుబడులను కాపాడుకునేందుకు అవసరమైన సదుపాయాలను కల్పించనున్నారు. 

Comments