Skip to main content

మార్గదర్శి కేసులో రామోజీరావుకు సుప్రీం నోటీసులు

 


మార్గదర్శి కేసులో  రామోజీరావుకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసును ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్  పిటీషన్ వేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం నిబంధనలకు విరుద్ధంగా 2,600 కోట్ల రూపాయలను, సుమారు రెండున్నర లక్షల మంది నుంచి రామోజీరావు డిపాజిట్ల రూపంలో సేకరించారని మాజీ ఐజి కృష్ణంరాజు  ఫిర్యాదు చేశారు. ఉమ్మడి హిందూ కుటుంబం  (హెచ్.యు.ఎఫ్) ద్వారా డిపాజిట్ల సేకరించడం చట్టరీత్యా నేరం కాదని ఉమ్మడి హైకోర్టు ముందు రామోజీ రావు వాదనలు వినిపించారు.

ఉమ్మడి హిందూ కుటుంబం (హెచ్.యు.ఎఫ్) ఒక వ్యవస్థ కాదు, ఒక కంపెనీ కాదు,  ఒక ఫరమ్ కాదు, వ్యక్తుల సమూహం కూడా కాదు. కాబట్టి, “ఆర్బీఐ చట్టం” సెక్షన్ 45 ( ఎస్) నిబంధనలు  వర్తించవని రామోజీ రావు చేసిన వాదనలతో అంగీకరించి ఉమ్మడి హైకోర్టు విభజన రోజున ఈ కేసును కొట్టివేసింది. గోప్యంగా ఉంచిన ఉమ్మడి హైకోర్టు తీర్పును, ఆలస్యంగా గ్రహించిన ఉండవల్లి, కోర్టు ను ఆశ్రయుంచడంలో  266 రోజుల పాటు జరిగిన జాప్యాన్ని  మన్నించాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

ఉండవల్లి పిటిషన్ ను విచారించిన జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం రిజర్వ్ బ్యాంకు, మాజీ ఐజి కృష్ణంరాజును కూడా ఈ కేసులో ఇంప్లీడ్ చేసేందుకు చేసుకున్న ఉండవల్లి దరఖాస్తులకు అనుమతి మంజూరు చేసింది. ఈ రోజు రామోజి రావుకు, మార్గదర్శి ఫైనాన్సియర్స్ కు, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు,  కృష్ణంరాజు కు నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు. ఈ నోటీసులకు లిఖిత పూర్వక సమాధానాలు దాఖలు చేసిన తర్వాత తదుపరి విచారణ చేపట్టనునుంది సుప్రీం కోర్టు.  

Comments

Popular posts from this blog

ఎలన్ మస్క్... స్టార్ షిప్ రెడీ... వచ్చే ఏడాది మార్స్ చెంతకు ప్రయాణం

మార్స్ గ్రహంపైకి వన్ వే ట్రిప్‌గా ఆసక్తి ఉన్న ప్రజలను పంపుతానని ప్రకటించిన ఆమెరికా బిలియనీర్ వ్యాపారి ఎలన్ మస్క్... అన్నంత పనీ చేస్తున్నారు. మనుషుల్ని చందమామ, మార్స్ చెంతకు తీసుకెళ్లడం కోసం ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్... సరికొత్త విమానం తరహా స్పేస్ షిప్‌లను తయారుచేస్తోంది. ఇవి రాకెట్‌‌లా కాకుండా... విమానం లాగా... అంతరిక్షంలోకి వెళ్లి... గ్రహాలపై మనుషుల్ని దించేసి... తిరిగి ఖాళీగా వెనక్కి వచ్చేస్తాయి. గ్రహాలపైకి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ఇందుకు రిటర్న్ ట్రిప్ అవకాశం కల్పించట్లేదు ఎలన్ మస్క్. వన్ వే ట్రిప్‌గా వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారే టికెట్ బుక్ చేసుకోమని సూచిస్తున్నారు. తాజాగా ఆయన ఆవిష్కరించిన స్పేస్‌షిప్‌లో వంద మంది ప్రయాణించేందుకు వీలుంది. టెక్సాస్... బోకా చికాలో... ఎంతో మంది అంతరిక్ష ఔత్సాహికులు, రిపోర్టర్ల సమక్షంలో చందమామ, మార్స్‌పైకి పంపే స్టార్ షిప్‌ను ఆవిష్కరించారు ఎలన్ మస్క్. వచ్చే ఆరు నెలల్లో దాన్ని అంతరిక్షంలో ఓ రౌండ్ వేయించి... వచ్చే ఏడాది మనుషులను అందులో పంపాలనుకుంటున్నారు ఎలన్ మస్క్. ఎప్పుడో పదకొండు ఏళ్ల కిందట ఫాల్కన్-1 రాకెట్‌ను తయారుచేసింది స్పేస్ ఎక...

క్రెడిట్ పై పెట్రోలును కొనుగోలు చేస్తే నో క్యాష్‌బ్యాక్‌

క్రెడిట్‌ కార్డులను వినియోగించి పెట్రోలును కొనుగోలు చేస్తే ఇన్నాళ్లూ లభిస్తున్న 0.75 శాతం క్యాష్‌బ్యాక్‌ అక్టోబరు ఒకటో తేది నుంచి ఉండబోదని కంపెనీలు ప్ర‌క‌టించాయి.  2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డిస్కౌంట్‌ ఇవ్వాలని చమురు కంపెనీలను కోరింది. దీంతో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి  2016 డిసెంబరు నుంచి క్రెడిట్‌, డెబిట్‌, ఈ-వాలెట్ల ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసే వారికి 0.75శాతం డిస్కౌంట్‌ను క్యాష్‌బ్యాక్‌ రూపంలో  ఇవ్వాల‌ని  చమురు కంపెనీలు క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించిన విష‌యం తెలిసిందే. కాగా వచ్చే నెల ఒకటో తేది నుంచి ఆ డిస్కౌంట్‌ ఉండబోదని తాజాగా కంపెనీలు వెల్లడించాయి. ఇకమీదట డెబిట్‌, ఇతర డిజిటల్‌ పద్ధతుల ద్వారా చెల్లించేవారికి మాత్రం ఈ డిస్కౌంట్‌ యధావిధిగా కొనసాగుతుంది.