ప్రపంచం మొత్తం కరోనాతో విలవిలలాడి పోతున్నది. కరోనా నుంచి బయటపడేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తున్నది. కరోనా ఎప్పుడు ఎవరికి ఎలా సోకుతుందో తెలియడం లేదు. ఇలాంటి సమయంలో అమెరికా మరో హెచ్చరిక చేసింది. అమెరికాలో కరోనాతో పాటు మల్టీసిస్టం ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అనే వ్యాధి విస్తరిస్తున్నట్టు అమెరికాకు చెందిన వ్యాధుల నియంత్రణ, చర్యల సంస్థ గుర్తించింది.
ఈ వ్యాధి ముఖ్యంగా పిల్లల్లో అధికంగా వస్తున్నట్టు అధికారులు గుర్తించారు. జ్వరంగా మొదలయ్యే ఈ వ్యాధి తరువాత శరీరంలోని మిగతా భాగాలను దెబ్బతీస్తోందని, ఈ వ్యాధి సోకిన పిల్లల్లో జ్వరం, చర్మంపై దద్దుర్లు, గుండెల్లో మంట వంటివి కనిపిస్తున్నాయని ఆ సంస్థ చెప్తున్నది. కరోనా వైరస్ సోకిన పిల్లల్లో ఎక్కువుగా ఈ లక్షణాలు ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. అమెరికాతో పాటుగా ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, బ్రిటన్ లో ఈ వ్యాధి విస్తరిస్తున్నట్టు అమెరికా పేర్కొన్నది. అమెరికాలో ఇప్పటి వరకు 600 పిల్లలకు ఈ వ్యాధి సోకింది. దీని కారణంగా 10 మంది మరణించినట్టు అమెరికా సీడీసీ సంస్థ తెలిపింది.
Comments
Post a Comment