అయోధ్యలో నిర్మితమవుతున్న రామాలయంలో 2.1 టన్నుల బరువుండే భారీ గంట ప్రధాన ఆకర్షణ కానుంది. ఉత్తరప్రదేశ్ లోని జలేసర్ లో ఈ గంటను దావూ దయాల్ అనే హిందూ ఫ్యామిలీ సిద్ధం చేస్తోంది. ఈ గంటను నైపుణ్యవంతులైన ముస్లిం కార్మికులు తయారు చేస్తుండటం గమనార్హం. ప్రస్తుతం దీనికి తుది మెరుగులు దిద్దుతున్నారు.
బంగారం, వెండి, రాగి, సీసం, పాదరసం, ఇనుము తదితర అష్టధాతువులతో దీన్ని తయారు చేశామని, ఈ గంటలో ఎటువంటి అతుకులు ఉండవని, ఇదే దీని ప్రత్యేకతని దయాల్ వెల్లడించారు. గతంలో ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయానికి టన్ను బరువైన గంటలు తయారు చేశామని, ఆ అనుభవంతోనే ఇప్పుడు దీని తయారీకి సిద్ధమయ్యామని వెల్లడించారు. ఈ గంట తయారీకి రూ. 21 లక్షలు ఖర్చవుతుందని, 25 మంది నిపుణులు, నాలుగు నెలల పాటు శ్రమించాలని అన్నారు.
Comments
Post a Comment