Skip to main content

మోదీతో జగన్‌ భేటీ



ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ ముగిసింది. జగన్ కంటె ఒక రోజు ముందుగానె తెలంగాణా సీఎం కేసీఆర్ మోదీతో భేటీ అయిన సంగతి తెలిసిందే.మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న ఆయన సాయంత్రం 04.30కి మోదీతో భేటీ అయ్యారు. వీరిద్దరూ పలు అంశాలపై దాదాపు 45 నిమిషాలు చర్చించారు.
ఈ నెల 15న రైతు భరోసా కార్యక్రమ ప్రారంభోత్సవానికి రావాలని ప్రధాని మోదీని సీఎం జగన్ ఆహ్వానించారు. అలాగే పోవలవరానికి సంబంధించిన పెండిగ్ నిధులను విడుదల చేయాలని కోరినట్లు సమాచారం. ఇంకా విభజన హామీలు, కడపలో ఉక్కు పరిశ్రమతో పాటు కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ తదితర అంశాలు ప్రధానితో సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం. జగన్ వెంట ఎంపీ విజయసాయి రెడ్డి సహా పలువురు నేతలు ఉన్నారు. రాజధాని నిర్మాణానికి ఆర్థిక సాయం, వెనుకబడిన జిల్లాలకు నిధులు మంజూరు చేయాలని సీఎం జగన్ విన్నవించారు.
సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టుకు ఆర్థిక సాయం, విశాఖ, కాకినాడ పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటుకు సహకారం తదితర విషయాలపై ప్రధానితో సమావేశంలో చర్చించినట్లు సమాచారం.రివర్స్ టెండరింగ్ , పీపీఏలు ఇతర ఒప్పందాలపై తీసుకుంటున్న చర్యలను ప్రధానికి వివరించినట్లు తెలుస్తోంది.
రాజధాని నిర్మాణానికి ఆర్థిక సాయం, వెనుకబడిన జిల్లాలకు నిధులు మంజూరు చేయాలని సీఎం జగన్ విన్నవించారు. అలాగే సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టుకు ఆర్థిక సాయం, విశాఖ, కాకినాడ పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటుకు సహకారంలాంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. జగన్ విన్నపాలపై మోదీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

Comments