Skip to main content

తీహార్ జైలులో చిదంబరానికి అస్వస్థత!

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పితో బాధపడుతున్న ఆయన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ కు ఈరోజు తరలించారు. అక్కడ సంబంధిత వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత తిరిగి ఆయనను జైలుకు తరలిస్తారని సంబంధిత వర్గాల సమాచారం.  

ఇదిలా ఉండగా, తీహార్ జైల్లో ఖైదీలకు ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు సాధారణంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలిస్తుంటారు. కానీ, చిదంబరం విషయంలో మాత్రం ఆయన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. ఒకవేళ చిదంబరానికి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తితే కనుక ఆయన్ని ఎయిమ్స్, ఆర్ఎంఎల్ ఆసుపత్రి, లేదా సఫ్దార్ జంగ్ ఆసుపత్రికి తరలించాలన్న కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి

Comments