దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో మహిళల రక్షణకు 5,500 మంది మార్షల్స్ ను నియమించాలని ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కారు నిర్ణయించింది. దేశ రాజధాని నగరంలో తిరుగుతున్న బస్సుల్లో మాజీ హోంగార్డులను మార్షల్స్ గా నియమించాలని నిర్ణయించినట్లు ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. బస్సుల్లో మహిళల భద్రత కోసం మాజీ హోంగార్డులను మార్షల్స్ గా దీపావళి పండుగలోగా నియమిస్తామని సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. కనీసం మూడేళ్ల పాటు హోంగార్డులుగా పనిచేసిన వారికి మార్షల్స్ గా నియామకాల్లో మొదటి ప్రాధాన్యం ఇస్తామని సీఎం చెప్పారు. బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళల సంరక్షణ బాధ్యత మార్షల్స్ దేనని సీఎం పేర్కొన్నారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ ప్రజారంజక చర్యలు తీసుకుంటున్నారు
Comments
Post a Comment