Skip to main content

గోదావరిలో బోటు ప్రమాదంపై ఎంపీ హర్షకుమార్ పిటిషన్.. విచారిస్తున్న సుప్రీంకోర్టు

గోదావరి నదిలో జరిగిన పడవ ప్రమాదంపై సుప్రీంకోర్టులో మాజీ ఎంపీ హర్ష కుమార్ పిటిషన్ వేశారు. ఈ ప్రమాదంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇంత వరకు ఆచూకీ లేకుండా పోయిన మృత దేహాలను వెంటనే వెలికి తీసేలా ఆదేశాలను ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. బోటు ప్రమాదం విచారణలో కేంద్ర ప్రభుత్వం కూడా తోడయ్యేలా సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేయాలని విన్నవించారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది.

మరోవైపు, బోటు ప్రమాదానికి సంబంధించి ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ పై హర్షకుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బోటులో ప్రయాణిస్తున్న వారి సంఖ్య 90 మందికి పైగానే ఉంటుందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో, హర్షకుమార్ పై పోలీసు కేసు నమోదైంది. ఆయన కోసం పోలీసు టీములు గాలిస్తున్నాయి.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.