Skip to main content

టీఎస్సార్టీసీ కార్మికులకు ఇంకా అందని జీతాలు!

టీఎస్సార్టీసీ కార్మికులు ఇంకా తమ జీతాలు అందుకోలేదు. మామూలుగా ప్రతి నెలా ఒకటో తేదీ నాటికి వారికి జీతాలు అందుతుంటాయి. అయితే, ఈ నెల అప్పుడే ఐదో తేదీ గడుస్తున్నా టీఎస్సార్టీసీ కార్మికులకు జీతాలు అందలేదు. కాగా, ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో వారికి జీతాల చెల్లింపులో ఉత్కంఠ నెలకొంది.

ఇదిలా ఉండగా, ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు దిగింది. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల నియామకాలు చేపట్టింది. నాలుగు వేల మంది డ్రైవర్లు, రెండు వేల మంది కండక్లర్లను నియమించింది. రేపటి నుంచి పూర్తి స్థాయిలో బస్సులు నడుపుతామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు

Comments