Skip to main content

వైసీపీ ఎమ్మెల్యే పై ఫిర్యాదు చేసిన ఎంపిడిఓ.. కేసు నమోదు చేసిన పోలీసులు


నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పై రురల్ పోలీసులు కేసు నమోదు చేశారు..ఎమ్మెల్యేతో పాటు వైసీపి జిల్లా అధికార ప్రతినిధి బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిపై నెల్లూరు గ్రామీణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
అనుచరులతో కలిసి ఎమ్మెల్యే తన ఇంటిపై దాడికి దిగాడని, నివాసంపై దౌర్జన్యంపై చేశారని వెంకటాచలం ఎంపిడిఓ సరళ పోలీసులను ఆశ్రయించారు.. వెంకటాచలం మండలంలోని గొలగమూడి వద్ద ఓ ప్రైవేటు లే అవుట్ కు సంభందించి పంచాయితీ పైప్ లైన్ కనెక్షన్ కావాలని తనకు వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి ఎంపిడిఓ సరళకు అప్లికేషన్ పెట్టుకున్నారు..
అయితే ఎంపిడిఓ బిజీగా ఉండటంతో ఆ అప్లికేషన్ పక్కన పెట్టారు. గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షలు, నియామకాలు తదితర అంశాల్లో తాను తీరిక లేకుండా ఉంటడంతో వారి ధరఖాస్తును పరిశీలించడం ఆలస్యమైందని ఆమె పిర్యాదులో తెలిపింది.
అయితే ఈనెల 1వ తేదీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ లో తనను బెదిరించారని శుక్రవారం రాత్రి ఏకంగా కల్లూరు పల్లిలోని తన నివాసం వద్దకు వచ్చి కరెంటు తీసివేయించారని ఆరోపించారు. ఇంట్లో ఉన్న తన కుటుంబసభ్యులను బెదిరించారని పోలీసులకు తెలిపింది. కాగా.. సరళ గతంలో జిల్లాలోని అనేక మండలాల్లో పని చేసింది.. ప్రస్తుతం వెంకటాచలంలో పనిచేస్తుంది..

Comments