తనపై ఓ వార పత్రిక అసత్యపు కథనాలు ప్రచురిస్తోందని రురల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు..తన పావు వచ్చిన అసత్య కథనాలపై జిల్లా జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్ ను కలిశారు..
కావాలనే ఉద్దేశ్యపూర్వకంగా తనపై ఇటీవల ఓ వార పత్రిక అసత్య ప్రచారాలు చేస్తూ వార్తలు రాస్తున్నారని జేసికి వివరించారు. తనతో పాటు పోలీస్, విజిలెన్స్ అధికారులపై తప్పుడు వార్తలు రాస్తున్నారని ఫిర్యాదు చేశారు.
వెంటనే దీనిపై విచారణ జరిపి నిజమని తేలితే తనపై చర్యలు తీసుకోవాలని కోరారు.వార్త అబద్దమని తేలితే పత్రిక ఎడిటర్, పాత్రికేయుడిపై కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇసుక అక్రమ రవాణా అంటూ వార్తలు రాస్తూ ప్రజలను ప్రక్కదోవ పట్టిస్తున్నారని జెసి దృష్టికి ఆయన తీసుకెళ్లారు.. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు..
Comments
Post a Comment