Skip to main content

తనకు బొత్స, సుచరిత తెలుసని బండ్ల గణేశ్ నన్ను బెదిరించాడు: నిర్మాత పీవీపీ

టాలీవుడ్ నిర్మాతలు పీవీపీ, బండ్ల గణేశ్ ల మధ్య నెలకొన్న ఆర్థిక వివాదం కారణంగా వీళ్లిద్దరూ పోలీసులను ఆశ్రయించి పరస్పరం ఫిర్యాదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పీవీపీని పలకరించిన మీడియాతో ఆయన మాట్లాడుతూ, 2013, నవంబర్ లో ‘టెంపర్’ సినిమాకు ఫైనాన్స్ చేశామని, 2015, ఫిబ్రవరి 13న ఈ సినిమా రిలీజు అయిందని చెప్పారు.

అయితే, ఈ సినిమా రిలీజు అయిన రోజున బండ్ల గణేశ్ తమకు రూ.7 కోట్లు తక్కువగా చెల్లించారని ఆరోపించారు. ఈ డబ్బు చెల్లించకుండా గత ఐదేళ్ల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడని, తమ ఉద్యోగస్తులను ఇబ్బందికి గురిచేయడం వంటి పనులు చేస్తున్నారని ఆరోపించారు. మోసం చేసే మనస్తత్వంతో తమకు కట్టుకథలు చెబుతున్నాడని, లీగల్ గా తాము తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు.

ఇక నిన్న సాయంత్రం తన నివాసం వద్దకు ముగ్గురు వ్యక్తులు వచ్చారని, తాను వాళ్లకు తెలుసని చెప్పడంతో వారిని సెక్యూరిటీ సిబ్బంది లోపలకి అనుమతించారని అన్నారు. ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఒకరి పేరు కిశోర్ అని, ఇద్దరు ముస్లిం వ్యక్తులని చెప్పారు. బండ్ల గణేశ్ తరపున మాట్లాడాలని కిషోర్ అనే వ్యక్తి తనతో చెప్పాడని, వారి బాడీ లాంగ్వేజ్ తేడాగా ఉందని, తన నివాసం నుంచి బయటకెళ్లిన తర్వాత ముప్పావు గంట అక్కడే నిలబడ్డారని ఆరోపించారు.

తన నివాసానికి వచ్చిన కిశోర్ తో పాటు ఆ ఇద్దరు వ్యక్తులను మళ్లీ చూస్తే గుర్తుపట్టగలుగుతానని అన్నారు. ఇలాంటి వాటికి తానేమీ భయపడనని చెప్పిన పీవీపీ, ఈ విషయమై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని చెప్పారు.

ఇటీవల పార్క్ హయత్ హోటల్ లో ఓ మీటింగ్ కు వెళ్లానని, అక్కడ వేరే వాళ్లను కలిసేందుకు వచ్చిన బండ్ల గణేశ్ తనను చూసి మాట్లాడాడని చెప్పారు. ఈ సందర్భంగా వారి మధ్య జరిగిన సంభాషణను ఆయన వివరించారు. ‘ఏమైంది, కనపడట్లేదు..లాస్ట్ వీక్ వస్తానన్నావుగా’ అని బండ్ల గణేశ్ తో తాను అంటే, ‘బిజీగా ఉన్నాను’ అని చెప్పాడని అన్నారు.

‘అమౌంట్ ఎప్పుడు క్లోజ్ చేస్తున్నారు?’ అని ప్రశ్నిస్తే, రూ.1.8 కోట్లు కదా! అని గణేశ్ అనడంతో, కాదు, రూ.7 కోట్లు అని చెప్పిన విషయాన్ని పీవీపీ గుర్తుచేశారు. ‘అన్న, నువ్వు నాతో పెట్టుకుంటే ఎప్పటికీ గెలవలేవు. నాకు హోం మినిస్టర్ సుచరిత గారు తెలుసు, బొత్స గారు తెలుసు’ అని గణేశ్ తనను పరోక్షంగా బెదిరించాడని చెప్పారు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.