Skip to main content

టీఎస్‌ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో 3 నిమిషాలకో మెట్రోరైలు

ఎస్‌ఆర్టీసీ కార్మికులు సమ్మె శంఖం పూరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తున్నది. ముఖ్యంగా నగర రవాణా సౌకర్యంలో మెట్రోరైలు కీలకం కానున్నది. నగరంలో ప్రతీరోజు నడిచే 3వేల బస్సులు రోడ్డెక్కని నేపథ్యంలో 3 నిమిషాలకో మెట్రోరైలు నడిపించనున్నారు. అంతేగాకుండా ప్రతీ మెట్రోరైలు ఉదయం 5 గంటల నుంచి అర్థ్ధరాత్రి 12.30 గంటల వరకు నడిపించనున్నారు. ఆర్టీసీ అధికారులతో జేటీసీ పాండురంగనాయక్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జంటనగరాల పరిధిలోని వేలాది బస్సులు,
క్యాబ్‌లను అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.