నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో మరో సారి పోలవరం అంశం తెరపైకి వచ్చింది. ఈ ప్రాజెక్టు పనుల కోసం సిద్ధమై, రాష్ట్ర ఖజానాకు చేరడం ఖాయమని భావించిన 3 వేల కోట్ల రూపాయల మొత్తాన్ని కేంద్రం నిలిపివేసింది. రాష్ట్ర ఆర్థికస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో ఈ మొత్తం విడుదలైతే కొంతమేరకైనా ఊరట లభిస్తుందని ఆర్థికశాఖ భావించింది. అనూహ్యంగా దానికి సంబంధించిన ఫైలును ఆపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైన తరువాత ఈ పరిణామం చోటుచేసుకోవడం అధికారయంత్రాం గాన్ని విస్మయపరిచింది. దీంతో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. శనివారం ప్రధాని మోడీతో జరగనున్న భేటీలో ఈ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తారని భావిస్తున్నారు. ఆ సమావేశంలో చర్చకు వచ్చినా, రాకపోయినా కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయమై పూర్తి వివరాలతో ఒక లేఖ రాయాలని ఆర్థికశాఖ అధికారులు భావిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పర్యవేక్షిస్తున్న పోలవరం అథారిటీకి కేంద్రం నురచి దాదాపు ఆరు వేల కోట్ల వరకు పాత బకాయిలు కేంద్రం నురచి రావాల్సి ఉరది.
దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలంగా కేంద్రంతో సంప్రదిరపులు జరుపుతూనే ఉరది. ఈ నిధుల్లో దాదాపు మూడు వేల కోట్లను రాష్ట్రానికి ఇచ్చేందుకు కేంద్రం సిధ్దమైనట్టు సమాచారం. దీనికి సంబంధించిన ఫైలు కూడా జలశక్తి శాఖ నుండి కేంద్ర ప్రభుత్వ ఆర్థికశాఖ ఆమోదానికి వెళ్లినట్లు తెలిసింది. ఒకటి, రెండు రోజల్లో నిధులు విడుదల అవుతాయని భావిస్తుండగా, ఆ ఫైలును ఆపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. వివిధ పనులకు సంబంధిరచిన టెరడర్లను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేంద్రానికి ఇష్టం లేదు. ఈ జాబితాలో పోలవరం కూడా ఉంది. దీనికి సంబంధించిన వివాదం న్యాయ స్థానంలో ఉండటంతో నిధులను ఇఫ్పటికిప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లు సమాచారం. నవయుగకు కేటాయించిన పోలవరం టెండర్ రద్దు పట్ల ప్రాజెక్టు అథారిటీ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్త ంచేసిన సంగతి తెలిసిందే. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక కూడా నిధులు నిలిపివేతకు కారణమని అంటున్నారు.
Comments
Post a Comment