గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. ఓ ప్రమాదంలో గాయపడిన మహిళకు సాయం చేసేందుకు తన కాన్వాయ్‌ని నిలిపివేసి మరీ ముందుకొచ్చారు. వృత్తిరీత్యా వైద్యుడైన ఆయన తొలుత ఆమె ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి, అనంతరం తన కాన్వాయ్‌లో సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారు. స్థానికులను విశేషంగా ఆకట్టుకున్న ఈ ఘటనపై వివరాల్లోకి వెళ్తే..
నిన్న ఓ అధికారిక పర్యటన కోసం ఢిల్లీ వెళ్లి వచ్చిన సావంత్... దాబోలిమ్ విమానాశ్రయం నుంచి తిరిగి వస్తూ జురాయ్ బ్రిడ్జివద్ద కాన్వాయ్ నిలిపివేశారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ మహిళా టూరిస్టు రోడ్డుపై పడిపోయినట్టు గుర్తించి హుటాహుటిన సాయం అందించేందుకు ముందుకొచ్చారు. వృత్తిరీత్యా ఆయన డాక్టర్ కావడంతో ఆమెకు స్వయంగా వైద్య పరీక్షలు చేశారు. ఆమె గాయాలకు ప్రధమ చికిత్స చేసి తన కాన్వాయ్‌లోని ఓ కారులో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి చేర్పించారు. ఘటనా స్థలంలో కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ప్రస్తుత ఇది వైరల్‌గా మారింది.
Comments
Post a Comment