Skip to main content

చందమామ మీద ఫోటోలను విడుదల చేసిన ఇస్రో, అద్భుతంగా పనిచేస్తున్న ఆర్బిటర్, విక్రమ్ ల్యాండర్ మిస్సయిందనే చింతను వదిలేయవచ్చు, ట్వీట్ చేసిన ఇస్రో


ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం చివరి క్షణాల్లో విఫలమైంది. చంద్రునిపై ల్యాండ్ అయ్యే సమయంలో విక్రమ్ ల్యాండర్ అదృశ్యమై పోయింది. అయినా నిరాశపడనవసరం లేదు. చందమామ చుట్టూ తిరుగుతున్న ఆర్బిటర్‌ ఇప్పుడు అద్భుతమైన ఫొటోలను తీసి పంపుతోంది. ల్యాండర్ తో పాటు చంద్రుని దక్షిణ భాగ ఉపరితలం దగ్గరగా వెళ్లిన ఆర్బిటర్ మాత్రం అద్భుతంగా పనిచేస్తోంది. చంద్రునిపై దాగి ఉన్న రహస్యాలను ప్రపంచానికి తెలియజేసేందుకు ఇస్రో చేసిన సాహసోపేత ప్రయత్నం నిరూపయోగం అయిందని భావిస్తున్న తరుణంలో ఆర్బిటల్ కొత్త ఆశలు రేపుతోంది. ఈ మేరకు ఆర్బిటర్‌ తీసిన చిత్రాలను ఇస్రో ట్వీట్‌ చేసింది. ఆర్బిటర్‌లో అమర్చిన ఎంతో కీలకమైన హై రిజల్యూషన్‌ కెమెరా ఈ ఫొటోలు తీసింది. కాగా చంద్రుడి నైసర్గిక స్వరూపం తెలుసుకునేందుకు ఈ ఫొటోలు ఉపయోగపడతాయని ఇస్రో తెలిపింది. ఆర్బిటర్‌ సెప్టెంబరు 5న చంద్రుడికి 100 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఈ ఫొటోలను తీసింది. దక్షిణ ధ్రువంలో 14 కిలోమీటర్ల వ్యాసం, 3 కిలోమీటర్ల లోతుతో ఉన్న 'బోగుస్లాస్కై ఈ' బిలాన్ని ఇస్రో గుర్తించింది . ఇందులో 5 మీటర్ల కన్నా తక్కువ వ్యాసమున్న రెండు చిన్న బిలాలను, 1 నుంచి 2 మీటర్ల ఎత్తున బండరాళ్లను ఇస్రో గుర్తించింది.

Comments