Skip to main content

జనసేనకు బిగ్ షాక్….పార్టీకి రాజీనామా చేసిన కీలక నేత


జనసేన పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందని కాపు నేత మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పార్టీకి రాజీనామా చేశారు. గత కొన్ని రోజులుగా పవన్‌ కల్యాణ్‌ తీరుపై అసహనంగా ఉన్న ఆయన.. పార్టీకి రాజీనామా చేశాసిన లేఖను పవన్ కు పంపించారు. పవన్‌ నేతృత్వంలోని జనసేన ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన నేపథ్యంలో కొన్ని రోజులుగా పలువురు సీనియర్‌ నేతలు పార్టీని వీడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రావెల కిషోర్‌బాబు, చింతల పార్థసారథి, మారంశెట్టి రాఘవయ్య, అద్దేపల్లి శ్రీధర్‌, డేవిడ్‌ రాజు జనసేనకు గుడ్‌బై చెప్పారు. తాజాగా సత్యనారాయణ కూడా పార్టీని వీడటం ఆపార్టీకి పెద్ద ఎదురు దెబ్బే.
కృష్ణా జిల్లా జనసేన కన్వీనర్‌ పాలడుగు డేవిడ్‌ రాజు… కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. కావలి శాసనసభ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన పసుపులేటి సుధాకర్ ఆగస్టు 1న ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరిపోయారు. నాయకులందరూ పార్టీని వీడుతున్నా పవన్ మాత్రం తన మౌనాన్ని వీడలేదు.

Comments