టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు ఆయనతో పాటు మాజీ సీఎఫ్ఓ మూర్తిలను అదుపులోకి తీసుకున్నారు. నిధులను దుర్వినియోగం చేశారంటూ టీవీ9 యాజమాన్యం రవిప్రకాశ్ పై ఫిర్యాదు చేసింది. డైరెక్టర్ల అనుమతి లేకుండానే చెక్కులతో డబ్బులు డ్రా చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొంది. కోట్లాది రూపాయలను రవిప్రకాశ్ దుర్వినియోగం చేశారని తెలిపింది. రూ. 18 కోట్లకు పైగా కుంభకోణం చోటు చేసుకుందని తెలిపారు. వీరిపై సెక్షన్ 409, 418, 420, 509ల కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో రవిప్రకాశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని, పీఎస్ లో విచారణ జరుపుతున్నారు.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments
Post a Comment