Skip to main content

చంద్రబాబు తీరు.. దొంగే దొంగ అన్నట్లుంది!


వైసిపీలో వైసీపీ, టీడీపీ మధ్య సోషల్‌ వార్‌ నడుస్తోంది. అసభ్యకర పోస్టుల వ్యవహారంపై ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్‌ చేశారు. విూడియాలో అసత్య ప్రచారానికి ఆధ్యుడు బాబేనని, ఆయన ఆరోపణలు చేయడం దొంగే దొంగ అరుస్తున్నట్లు ఉందంటూ ఎద్దేవా చేశారు. అనుకూల విూడియాను అడ్డుపెట్టుకుని ఇష్టమొచ్చినట్లు బురదజల్లడం చంద్రబాబుకు నలభై ఏళ్లుగా అలవాటేనని విజయసాయి విమర్శించారు. వైసీపీ మహిళా నేతలను అత్యంత నీచమైన భాషతో తిట్టించారని ఆరోపించారు. ఇప్పుడు ఆయనదాకా వచ్చే సరికి తనే బాధితుడినన్నట్టు అనుకూల విూడియాలో శోకాలు పెడుతున్నాడన్నారు. తన వరకు వస్తే కానీ ఆ బాధేమిటే తెలియలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం ఆవిర్భావానికి ముందు నుంచే పచ్చవిూడియాలో అభూత కల్పనలు రాస్తూ ప్రజలను మోసం చేశారని విజయసాయి ఆరోపించారు. 1982 నుంచి ‘లేనిది ఉన్నట్టు’ రాస్తూ ప్రజలను మభ్య పెట్టిన పచ్చ విూడియా అడ్రసు గల్లంతవుతుందనే భయం చంద్రబాబుకు పట్టుకుందన్నారు. అందుకే సోషల్‌ విూడియా పోస్టింగులపై విూడియా కాన్ఫరెన్స్‌ పెట్టి తన స్థాయిని దిగజార్చుకున్నాడని విమర్శలు గుప్పించారు. తన పాలనలో 600 కేసులు పెట్టి వేధించిన సంగతి ఎవరూ మర్చి పోరంటూ వ్యాఖ్యానించారు. సోషల్‌ విూడియాలో పోస్టుల వ్యవహారంపై చంద్రబాబు ప్రెజెంటేషన్‌పై విజయసాయి సెటైర్లు పేల్చారు. మొన్నటి వరకు అమరావతి ప్రపంచ స్థాయి సిటీ, రెండో టోక్యో అవుతుందని ప్రజెంటేషన్లతో చావగొట్టాడంటూ హేళన చేశారు. ఇప్పడేమో సోషల్‌ విూడియాలో దుర్భాషలాడుతున్నారని ఎవరూ పట్టించుకోని పోస్టులను అందరికీ చూపించి పాతాళంలోకి జారిపోయాడని విమర్శలు చేశారు. ఎన్ని జాకీలు పెట్టినా పచ్చ విూడియా చంద్రబాబును బయటకు లాగలేదని విజయసాయి ఎద్దేవా చేశారు.

Comments

Popular posts from this blog

ఎలన్ మస్క్... స్టార్ షిప్ రెడీ... వచ్చే ఏడాది మార్స్ చెంతకు ప్రయాణం

మార్స్ గ్రహంపైకి వన్ వే ట్రిప్‌గా ఆసక్తి ఉన్న ప్రజలను పంపుతానని ప్రకటించిన ఆమెరికా బిలియనీర్ వ్యాపారి ఎలన్ మస్క్... అన్నంత పనీ చేస్తున్నారు. మనుషుల్ని చందమామ, మార్స్ చెంతకు తీసుకెళ్లడం కోసం ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్... సరికొత్త విమానం తరహా స్పేస్ షిప్‌లను తయారుచేస్తోంది. ఇవి రాకెట్‌‌లా కాకుండా... విమానం లాగా... అంతరిక్షంలోకి వెళ్లి... గ్రహాలపై మనుషుల్ని దించేసి... తిరిగి ఖాళీగా వెనక్కి వచ్చేస్తాయి. గ్రహాలపైకి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ఇందుకు రిటర్న్ ట్రిప్ అవకాశం కల్పించట్లేదు ఎలన్ మస్క్. వన్ వే ట్రిప్‌గా వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారే టికెట్ బుక్ చేసుకోమని సూచిస్తున్నారు. తాజాగా ఆయన ఆవిష్కరించిన స్పేస్‌షిప్‌లో వంద మంది ప్రయాణించేందుకు వీలుంది. టెక్సాస్... బోకా చికాలో... ఎంతో మంది అంతరిక్ష ఔత్సాహికులు, రిపోర్టర్ల సమక్షంలో చందమామ, మార్స్‌పైకి పంపే స్టార్ షిప్‌ను ఆవిష్కరించారు ఎలన్ మస్క్. వచ్చే ఆరు నెలల్లో దాన్ని అంతరిక్షంలో ఓ రౌండ్ వేయించి... వచ్చే ఏడాది మనుషులను అందులో పంపాలనుకుంటున్నారు ఎలన్ మస్క్. ఎప్పుడో పదకొండు ఏళ్ల కిందట ఫాల్కన్-1 రాకెట్‌ను తయారుచేసింది స్పేస్ ఎక...

క్రెడిట్ పై పెట్రోలును కొనుగోలు చేస్తే నో క్యాష్‌బ్యాక్‌

క్రెడిట్‌ కార్డులను వినియోగించి పెట్రోలును కొనుగోలు చేస్తే ఇన్నాళ్లూ లభిస్తున్న 0.75 శాతం క్యాష్‌బ్యాక్‌ అక్టోబరు ఒకటో తేది నుంచి ఉండబోదని కంపెనీలు ప్ర‌క‌టించాయి.  2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డిస్కౌంట్‌ ఇవ్వాలని చమురు కంపెనీలను కోరింది. దీంతో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి  2016 డిసెంబరు నుంచి క్రెడిట్‌, డెబిట్‌, ఈ-వాలెట్ల ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసే వారికి 0.75శాతం డిస్కౌంట్‌ను క్యాష్‌బ్యాక్‌ రూపంలో  ఇవ్వాల‌ని  చమురు కంపెనీలు క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించిన విష‌యం తెలిసిందే. కాగా వచ్చే నెల ఒకటో తేది నుంచి ఆ డిస్కౌంట్‌ ఉండబోదని తాజాగా కంపెనీలు వెల్లడించాయి. ఇకమీదట డెబిట్‌, ఇతర డిజిటల్‌ పద్ధతుల ద్వారా చెల్లించేవారికి మాత్రం ఈ డిస్కౌంట్‌ యధావిధిగా కొనసాగుతుంది.